కేంద్రం మెడలు వంచుతామని ప్రజల మెడలు వంచారు, కేసుల మాఫీకోసం : వైయస్ జగన్ పై లోకేష్ ఫైర్

Published : Jul 05, 2019, 09:51 PM ISTUpdated : Jul 05, 2019, 09:52 PM IST
కేంద్రం మెడలు వంచుతామని ప్రజల మెడలు వంచారు, కేసుల మాఫీకోసం : వైయస్ జగన్ పై లోకేష్ ఫైర్

సారాంశం

కేసుల మాఫీ కోసం సీఎం వైయస్ జగన్ మోదీకి సాష్టాంగ పడ్డారని ఆరోపించారు. ఫలితంగా ఏపీకి  రావాల్సిన నిధులు, హక్కులు గాలికొదిలారని విమర్శించారు. రాష్ట్రంలో 25 ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతాం అన్న వైయస్ జగన్ కేంద్రం ముందు సాష్టాంగపడి ఏపీ ప్రజల మెడలు వంచారని ఘాటుగా విమర్శించారు. 

అమరావతి: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై వినూత్న రీతిలో స్పందించారు మాజీమంత్రి నారా లోకేష్. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి మెుండి చేయి చూపడానికి సీఎం వైయస్ జగన్ వ్యవహార శైలియే కారణమంటూ ట్వీట్ చేశారు. 

కేసుల మాఫీ కోసం సీఎం వైయస్ జగన్ మోదీకి సాష్టాంగ పడ్డారని ఆరోపించారు. ఫలితంగా ఏపీకి  రావాల్సిన నిధులు, హక్కులు గాలికొదిలారని విమర్శించారు. రాష్ట్రంలో 25 ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతాం అన్న వైయస్ జగన్ కేంద్రం ముందు సాష్టాంగపడి ఏపీ ప్రజల మెడలు వంచారని ఘాటుగా విమర్శించారు. 

రాష్ట్రప్రజలు వైయస్ జగన్ కు 22 మంది ఎంపీలను గెలిపించి ఇస్తే జగన్ కేంద్రం నుంచి సాధించింది ఏమీ లేదని విమర్శించారు. 22 మంది ఎంపీలను ఇచ్చినందుకు కేంద్రం నుంచి జీరో బేస్డ్ న్యాచురల్ బడ్జెట్ సాధించారంటూ జగన్ పై లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

PREV
click me!

Recommended Stories

CM Nara Chandrababu Naidu సంక్రాంతి, కనుమ పై కీలక ప్రసంగం at Naravaripalle | Asianet News Telugu
Chandrababu Speech: అందుకే P4 తెచ్చాం.. 10లక్షల కుటుంబాలను అడాప్ట్ చేసుకున్నాం | Asianet News Telugu