నేడు అమరావతి రైతులు, రేపు విశాఖ రైతులా...? జగన్ పై లోకేష్ విమర్శలు

By telugu teamFirst Published Feb 10, 2020, 1:20 PM IST
Highlights

నేడు అమరావతి రైతులకు అన్యాయం చేసినట్లు ... రేపు విశాఖ రైతులకు అన్యాయం చేయరని నమ్మకం ఏమిటని లోకేష్ ప్రశ్నించారు. ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కురిపించారు.
 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ యువ నేత నారాలోకేష్ విమర్శల వర్షం కురిపించారు. గతంలో రాజధానిగా అమరావతి ఉన్న విషయం తెలిసిందే. దానిని సీఎం జగన్ విశాఖకు మార్చారు. మొత్తంగా మూడు రాజధానులు తీసుకువచ్చారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. రాజధాని కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతులు నెలల పాటుగా ఆందోళనలు చేస్తున్నారు.

కాగా... ఈ ఘటనపై తాజాగా మరోసారి లోకేష్ విమర్శలు చేశారు. నేడు అమరావతి రైతులకు అన్యాయం చేసినట్లు ... రేపు విశాఖ రైతులకు అన్యాయం చేయరని నమ్మకం ఏమిటని లోకేష్ ప్రశ్నించారు. ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కురిపించారు.

Also Read కియా మోటార్స్ పై వెనక్కి తగ్గని రాయిటర్స్: ప్లాంట్ తరలింపుపై స్పష్టీకరణ...

‘‘ఆరోగ్యం విషమించినా రాష్ట్ర భవిష్యత్తు అయిన అమరావతిని మాత్రం వదలలేదు. పోలీసులు దీక్ష భగ్నంచేసినా ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్నారు యువకులు. ఆందోళనలు 55వ రోజుకు చేరినా జగన్ గారి మనసు కరగడం లేదు. జగన్ గారు ఈరోజు అమరావతి రైతులకు చేసిన అన్యాయం రేపు విశాఖ రైతులకు చెయ్యరని నమ్మకం ఏంటి? అని ప్రశ్నించారు. ‘మూడు ముక్కల రాజధాని వద్దు... అభివృద్ధే ముద్దు’ అని అన్ని ప్రాంతాల ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారు. జగన్ గారికి మాత్రం ఈ విషయం అర్ధం కావడం లేదు’’ అని నారా లోకేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

click me!