బొత్స నిజం చెప్పారు, కావాలంటే మీరే చూడండి.. ట్విట్టర్ లో లోకేష్ కౌంటర్

By telugu teamFirst Published Jan 18, 2020, 4:22 PM IST
Highlights

ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ‘‘ రాజధాని అక్కడే ఉంటుంది.. అక్కడే ఉండాలి కూడా.. జగన్మోహన్ రెడ్డి కూడా అదే విషయం చెప్పారు. మేమంతా కోరేది కూడా అదే. ఎవరైతే భూకబ్జాలు చేస్తారో.. వాళ్లకు కావాలి రాజధాని మార్పు’’ అంటూ బొత్స మాట్లాడిన వీడియోని లోకేష్ ట్వీట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ప్రస్తుతం సర్వత్రా చర్చ జరుగుతోంది. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని అధికార పార్టీ యోచిస్తోంది. అయితే... అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ప్రతిపక్షాలు పట్టుపడుతున్నాయి. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు కూడా ఇదే పట్టుపడుతున్నారు. ఇదే విషయంపై ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణను మీడియా ప్రశ్నించింది.

అయితే... మీడియా ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పకోగా... ఎదురు ప్రశ్నలు వేసి తెలివిగా తప్పించుకున్నారు. కాగా... ఇదేవిషయంలో మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్.. ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాజధానిపై గతంలో బొత్స మాట్లాడిన మాటలను.. తాజాగా మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలను ట్వీట్ చేస్తూ.. ఈ అబద్ధపు నోట తన్నుకొచ్చిన నిజం అని టైటిల్ పెట్టారు. భూకబ్జాల కోసమే రాజధాని మార్పు చేస్తున్నారన్న విషయాన్ని బొత్స స్వయంగా ఒప్పుకున్నారని లోకేశ్ ట్వీట్ చేశారు. 

Also Read బీజేపీతో పవన్ పొత్తు.. తొలిసారి స్పందించిన కృష్ణం రాజు.

ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ‘‘ రాజధాని అక్కడే ఉంటుంది.. అక్కడే ఉండాలి కూడా.. జగన్మోహన్ రెడ్డి కూడా అదే విషయం చెప్పారు. మేమంతా కోరేది కూడా అదే. ఎవరైతే భూకబ్జాలు చేస్తారో.. వాళ్లకు కావాలి రాజధాని మార్పు’’ అంటూ బొత్స మాట్లాడిన వీడియోని లోకేష్ ట్వీట్ చేశారు.

భూకబ్జాల కోసమే రాజధాని మార్పు - ఈ అబద్ధపు నోట తన్నుకొచ్చిన నిజం pic.twitter.com/T7bz4iogtV

— Lokesh Nara (@naralokesh)

 

మరో వీడియోలో.. ప్రస్తుతం అధికారంలో ఉండగా..గతంలో  మాటలకు ఎక్కడా పొంతన లేకుండా మాట్లాడారు. రాజధాని ఎక్కడ అంటే ఏం చెప్పాలి సార్.. అని ఓ విలేఖరి ప్రశ్నించగా.. ఐదేళ్లు పూర్తయ్యే వరకు నోటిఫికేషన్ ఇవ్వలేదని.. అడ్రస్ లేకుండా.. నోటిఫికేషన్ లేనప్పుడు.. ఇప్పుడు వచ్చి ప్రశ్నిస్తున్నారా అని మీడియానే ఎదురు ప్రశ్నించారు. మూడు రాజధానులు తామనలేదని.. వాళ్లు చేసిన రికమెండేషన్ అని అన్నారు.

click me!