సత్తెనపల్లిలో తెలుగు తమ్ముళ్ల ఘర్షణ.. నియోజకవర్గ నాయకులపై మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆగ్రహం...

By SumaBala BukkaFirst Published Nov 11, 2022, 9:22 AM IST
Highlights

పల్నాడు జిల్లాలో తెలుగు తమ్ముళ్లు ఘర్షణ పడ్డారు. పరిశీలకుల మీద, విలేకరుల మీద అనుచితంగా వ్యవహరించారు. దీంతో ఉద్రిక్తతకు దారి తీసింది. 

పల్నాడు జిల్లా :  సత్తెనపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో  సంస్థాగత ఎన్నికల ప్రక్రియ గురువారం రసాభాసగా మారింది. నాలుగు మండలాలు,  సత్తెనపల్లి పట్టణ అధ్యక్ష పదవితో పాటు క్లస్టర్ ఇన్చార్జిల నియామకానికి అభిప్రాయ సేకరణ జరపటానికి పార్టీ పరిశీలకుల బృందం వచ్చింది. మొదట నియోజకవర్గానికి ఇన్చార్జిని  నియమించాలని హడావుడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఒక దశలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు నియోజకవర్గ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.

దివంగత నేత కోడెల శివప్రసాదరావుకుమారుడు శివరాం మద్దతుదారులు ఇన్చార్జి పదవి తమ నాయకుడికి ఇవ్వాలంటూ కార్యాలయంలోకి చొచ్చుకు వచ్చి పరిశీలకులతో ఘర్షణ పడ్డారు. మిగిలిన నాయకుల అనుయాయులు తమ నాయకుడికి ఇన్చార్జి పదవి ఇవ్వాలని పట్టుబట్టడంతో  ఈ క్రమంలో అరుపులు కేకలతో కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. శివరాం మద్దతుదారులు మాజీ ఎమ్మెల్యే వై వి ఆంజనేయులు మద్దతుదారులతో వాగ్వాదానికి దిగారు.  ఆంజనేయులును అడ్డుకునే ప్రయత్నం చేశారు.

తిరుమల శ్రీవారి లడ్డూ బరువుపై టీడీపీ విమర్శలు.. కారణమిదే, క్లారిటీ ఇచ్చిన టీటీడీ

 ఈ క్రమంలో కొందరు బాహాబాహి కుర్చీలు విసిరేశారు కొనే పరిస్థితి వరకు వెళ్ళింది.  పరిశీలకులుగా వచ్చిన వారిని నిర్బంధించే ప్రయత్నం కూడా చేశారు. ఈ క్రమంలో లో కొందరు విలేకర్ల ఫోన్లు లాక్కొని వారితో అనుచితంగా ప్రవర్తించారు. పార్టీ పరిశీలకులుగా ఎమ్మెల్యే డోల వీరాంజనేయ స్వామి, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, మాజీ ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు,  ధూళిపాళ్ల నరేంద్ర కుమార్,  నియోజకవర్గ పరిశీలకుడు గన్నె వెంకట నారాయణ ప్రసాద్  నాయకులతో మాట్లాడి గొడవ సద్దుమణిగేలా చేశారు.

click me!