రాబోయే ఎన్నికల్లో టీడీపీ భవితవ్యంపై మాజీమంత్రి జోస్యం

By Nagaraju TFirst Published Dec 28, 2018, 12:17 PM IST
Highlights

రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఘోర పరాభవం తప్పదని మాజీమంత్రి బీజేపీ నేత మాణిక్యాలరావు జోస్యం చెప్పారు. గత ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చిన టీడీపీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రెట్టింపు ఓట్లతో అంటే పది లక్షలకుపైగా ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోతుందని తెలిపారు. 
 

కాకినాడ: రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఘోర పరాభవం తప్పదని మాజీమంత్రి బీజేపీ నేత మాణిక్యాలరావు జోస్యం చెప్పారు. గత ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చిన టీడీపీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రెట్టింపు ఓట్లతో అంటే పది లక్షలకుపైగా ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోతుందని తెలిపారు. 

 తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని శ్రీసత్యనారాయణ స్వామిని దర్శించుకున్న మాణిక్యాలరావు చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌ అభివృద్ధి అంతా తానే చేశానని గొప్పలు చెప్పుకున్న చంద్రబాబుకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. 

రాష్ట్రంలో జరిగిన ప్రతి అభివృద్ధి కార్యక్రమం కేంద్రప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే జరిగిందని చెప్పారు. మరోవైపు జనవరి 6న ఏపీలో మోదీ పర్యటనను ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు. గుంటూరులో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగసభ జరిగి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. 
 
ప్రధాని మోదీకి దేశంలో ఎక్కడికైనా వెళ్లే అధికారం ఉందని ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చని తేల్చిచెప్పారు. ప్రధాని బహిరంగ సభకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. 

 

ఈ వార్తలు కూడా చదవండి

నేను త్యాగం చేస్తేనే ఎమ్మెల్యే అయ్యావ్ : ఈలి నాని

చిల్లర రాజకీయాలు మానుకో: మాణిక్యాల రావుకు చంద్రబాబు వార్నింగ్

మాజీ మంత్రి మాణిక్యాల రావు సంచలన నిర్ణయం

మాజీ మంత్రి మాణిక్యాలరావుకు అస్వస్థత...ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత

 

click me!