పవన్ కల్యాణ్ కు ఏపీ బిజెపి అధ్యక్ష పదవి...: అనుమానం వ్యక్తంచేసిన మాజీ మంత్రి (వీడియో)

By Arun Kumar PFirst Published Mar 30, 2021, 1:15 PM IST
Highlights

ట్విట్టర్లో సోము వీర్రాజు చేసిన కామెంట్స్ పై మంగళవారం మాజీ మంత్రి జవహర్ స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో సందేశం విడుదల చేశారు. 

గుంటూరు: ఏపీకి బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యాక ఏ హామీని రాష్ట్రానికి సాధించావు సోము వీర్రాజు.? అని మాజీ మంత్రి కొత్తపల్లి జవహర్ ప్రశ్నించారు. ట్విట్టర్లో సోము వీర్రాజు చేసిన కామెంట్స్ పై  మంగళవారం మాజీ మంత్రి జవహర్ స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో సందేశం విడుదల చేశారు. 

''మీ మాటలు చూస్తే ఏపీ ప్రజలు మతిమరుపువాళ్లలాగా కనిపిస్తున్నారేమో అనిపిస్తోంది. తిరుపతి వెంకన్న పాదాల సాక్షిగా మోడీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి.? ఏపీకి ఇచ్చిన హామీలను తిరుపతి ప్రజలు అడుగుతారనే భయంతోనే సోము వీర్రాజు ట్విట్టర్ ను నమ్ముకుంటున్నారు. పాచిపోయిన లడ్డూలకు పరిమితి ఉందా? లేదా? సమాధానం చెప్పాలి'' అని జవహర్ అడిగారు. 

''సోమూకు పవన్ అంత ఆప్తమిత్రుడు ఎలా అయ్యారో తెలీదు. పవన్ కు అధ్యక్ష పీఠం ఇచ్చి కాకా పడతారేమోనన్న అనుమానం కలుగుతోంది. పనబాక లక్ష్మీ ఏ సందర్భంలో చంద్రబాబు గురించి అలా మాట్లాడారో కూడా వీర్రాజు చెప్పాలి. ఇలా కట్ అండ్ పేస్ట్ చేసి కాదు'' అని అన్నారు. 

వీడియో

''ఏపీకి హోదా గురించి తిరుపతి ప్రజలు నిలదీస్తారు జాగ్రత్త. వీర్రాజుకు చంద్రబాబుపై ప్రేమ ఒక్క సందర్భంలోనే వచ్చింది. వార్డు మెంబర్ గా గెలవలేని వీర్రాజుకు ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత వారం, నెల రోజులు పాటు మాత్రమే విశ్వాసంగా ఉన్నారు. చంద్రబాబు మీద ట్వీట్లు పెడితే ఓట్లు రావు. మీ రహస్య మిత్రులు, మీ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ ఉన్న వైసీపీ మీద పోరాడితే మీకు లబ్ది చేకూరుతుంది'' అని సూచించారు. 

''చంద్రబాబు మీద ట్వీట్లు పెట్టి, పోస్టులు పెడితే ఏమొస్తుంది? ఫోకస్ పెట్టాల్సింది రాష్ట్ర ప్రయోజనాల మీద. ప్రత్యేక హోదాపై ప్రజల ఆశ సజీవంగానే వున్నాయి. లోపాయికారి ఒప్పందం భూస్థాపితం చేసిన వాటి గురించి వైవీ సుబ్బారెడ్డి మళ్లీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అవే మాట్లాడి ఆశలు రేకెత్తించి ఓట్ల లబ్ధి పొందాలని చూస్తే సాధ్యం కాదు'' అని జవహర్ విమర్శించారు.
 

click me!