2024 ఏపీ శానససభ ఎన్నికల్లో తమ ముఖ్యమంత్రి అభ్యర్థి జనసేన చీఫ్ పవన్ కల్యాణే అని బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. తిరుపతి కోసం మాత్రమే సోము వీర్రాజు ఆ ప్రకటన చేయలేదని జీవీఎల్ స్పష్టం చేశారు.
తిరుపతి: 2024 శాసనసభ ఎన్నికల్లో తమ ముఖ్యమంత్రి అభ్యర్థి జనసేన చీఫ్ పవన్ కల్యాణేనని బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చెప్పారు. తమ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనను సందేహించాల్సిన అవసరం లేదని, సుదీర్ష ప్రయోజనాన్ని ఆశించి పవన్ కల్యాణ్ తమ అధిపతి అని చెప్పారని ఆయన అన్నారు. బీహార్ లో తాము నితీష్ కుమార్ నాయకత్వాన్ని అంగీకరించామని, అదే రీతిలో ఇక్కడ పవన్ కల్యాణ్ ను అంగీకరిస్తామని ఆయన చెప్పారు.
సోము వీర్రాజు చేసిన ప్రకటన తెలుగుదేశం పార్టీ, వైసీపీ నేతల గుండెల్లో గుబులు పుట్టించిందని, వారు చేస్తున్న ప్రకటనలే అందుకు నిదర్శనమని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్ గురించి సోము వీర్రాజు ప్రకటన చేసిన వెంటనే టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి తమకు సినీ తారలు కావాలని అన్నారని, తమకు తారక్ రత్న, నవరత్న కావాలని అన్నారని ఆయన అన్నారు.
undefined
తిరుపతి లోకసభ ఉప ఎన్నిక కోసం పవన్ కల్యాణ్ తమ అధిపతి అని ప్రకటించలేదని, ఈ విషయంలో తమ వైఖరి మారబోదని ఆయన అన్నారు తిరుపతి ఉప ఎన్నిక కోసం పవన్ కల్యాణ్ తమ అధిపతి అని ప్రకటించారనే ప్రచారంలో నిజం లేదని ఆయన అన్నారు. సోము వీర్రాజు ప్రకటన చేసిన వెంటనే చంద్రబాబు, నారా లోకేష్, విజయసాయి రెడ్డిల్లో గుబులు ప్రారంభమైందని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వల్ల ఏమీ ఒరదని జీవీఎల్ అన్నారు తిరుపతిలో తాము ఏమీ చేయలదనే విషయం చర్చకు వస్తుందనే భయంతోనే వైసీపీ, టీడీపీ ప్రత్యేక హోదాను ముందుకు తెస్తున్నాయని, ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన విమర్శించారు. తిరుపతిలో వైసీపీ, టీడీపీల్లో ఏ పార్టీ గెలిచినా ప్రయోజనం ఉండదని, బిజెపి అభ్యర్థి గెలిస్తేనే తిరుపతి అభివృద్ధి జరుగుతుందని ఆయన చెప్పారు.