జగన్ గట్టిగా చూస్తే చస్తారు.. వార్డు మెంబర్లుగా కూడా గెలవలేరు, తొడలు కొడతారా : మహానాడుపై కొడాలి నాని వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : May 27, 2022, 07:52 PM IST
జగన్ గట్టిగా చూస్తే చస్తారు.. వార్డు మెంబర్లుగా కూడా గెలవలేరు, తొడలు కొడతారా : మహానాడుపై కొడాలి నాని వ్యాఖ్యలు

సారాంశం

టీడీపీ మహానాడుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని. జగన్ గట్టిగా చూస్తే చచ్చే వెధవలు తొడలు కొడుతున్నారని ఆయన హాట్ కామెంట్స్ చేశారు. మహానాడుకు సామాజిక న్యాయ భేరికి నక్కకు, నాక లోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉందని నాని అన్నారు. 

టీడీపీ అధినేత (tdp)  , ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై (chandrababu naidu) మండిపడ్డారు మాజీ మంత్రి కొడాలి నాని (kodali nani) . అమలాపురంలో మా ఎమ్మెల్యే, మంత్రి ఇళ్లకు నిప్పంటించి మళ్లీ చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఫైరయ్యారు. టీడీపీకి ఏపీ ప్రజలు  ఎప్పుడో సమాధి కట్టారని నాని అన్నారు. బస్సు యాత్రపై (ysrcp ministers bus yatra) చంద్రబాబు విషం కక్కుతున్నాడని.. మహానాడుకు భయపడుతున్నారు అనటానికి చంద్రబాబుకు సిగ్గు ఉండాలంటూ నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొడుకును ఎమ్మెల్యేగా గెలిపించుకోలేని వ్యక్తి జగన్‌ను ఓడిస్తాడా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని కొడాలి నాని హెచ్చరించారు.

చంద్రబాబు ఎందుకు బతికి ఉన్నాడో అతనికే తెలియదని... ఎన్టీఆర్ చెప్పినట్లు చంద్రబాబు జామాత దశమ గ్రహమని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌ను చంపి, పూల మాలలు వేస్తున్నారని నాని మండిపడ్డారు. జగన్ గట్టిగా చూస్తే చచ్చే వెధవలు తొడలు కొడుతున్నారంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని వారు ఆ వేదిక మీద ఉన్నారని... పార్టీ లేదు బొక్కా లేదు అన్న అచ్చెన్నాయుడు (atchannaidu) పార్టీ అధ్యక్షుడా అంటూ నాని మండిపడ్డారు. 

ALso Read:జగన్ ప్రభుత్వంలో రెండు భారీ కుంభకోణాలు.. మహానాడు తర్వాత బయటపెడతా : నారా లోకేష్ సంచలనం

చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన గ్రహం అని దుయ్యబట్టారు కొడాలి నాని. బీసీ, ఎస్సీ ఎస్టీ వారికి అన్ని విధాలుగా న్యాయం చేస్తోంది వైసీపీ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. 80 శాతం మంది ప్రజల కోసం జగన్‌ని ఎందుకు పంపుతారన్న నాని.. 20 శాతం మంది కోసం రాష్ట్రాన్ని కొల్లగొట్టారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో 420 గాళ్ళకు రాష్ట్ర ప్రజలు రాజకీయ సమాధి కడతారని.. వైసీపీకి బ్రహ్మరథం పడతారని కొడాలి నాని జోస్యం చెప్పారు. చంద్రబాబునాయుడు దత్త పుత్రుడు, ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తున్నారని నాని ఫైరయ్యారు. ఊరూరా తిరిగి జగన్‌ని భ్రష్టుపట్టించాలని చూస్తున్నారని, వారి ఆటలు సాగవని కొడాలి నాని హెచ్చరించారు. 

టీడీపీ మహానాడు (tdp mahanadu) అంటే, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భోజనాలు పెట్టి, వేల మందిని తరలించి చేసుకునేదని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి కార్యక్రమానికి.. సామాజిక న్యాయ భేరికి నక్కకు, నాక లోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉందని కొడాలి నాని అన్నారు. మీకు భయపడి మేం బస్సు యాత్ర పెట్టామని సిగ్గు, ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. హైదరాబాద్‌లో ఉంటూ,  రాష్ట్రానికి చుట్టపు చూపుగా వచ్చే చంద్రబాబుకు సామాజిక న్యాయం గురించి ఏం తెలుస్తుందని కొడాలి నాని ప్రశ్నించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్