నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి గుండెపోటు.. ఐసీయూలో చికిత్స

Siva Kodati |  
Published : May 27, 2022, 06:15 PM ISTUpdated : May 27, 2022, 06:27 PM IST
నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి గుండెపోటు.. ఐసీయూలో చికిత్స

సారాంశం

వైసీపీ సీనియర్ నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గుండెపోటుకు గురయ్యారు. నెల్లూరులోని అపోలో ఆసుపత్రిలోని ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. మెరుగైన చికిత్స నిమిత్తం కోటంరెడ్డిని చెన్నైకి తరలిస్తున్నారు. 

వైసీపీ సీనియర్ నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గుండెపోటుకు గురయ్యారు. నెల్లూరులోని అపోలో ఆసుపత్రిలోని ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. నెల్లూరు  రూరల్ మండలంలో గడప గడపకు కార్యక్రమం నిర్వహిస్తున్న కోటంరెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గుండెలో నొప్పిగా వుందని చెప్పడంతో వ్యక్తిగత సిబ్బంది ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్దితి నిలకడగానే వుందని సమాచారం. మెరుగైన చికిత్స నిమిత్తం కోటంరెడ్డిని చెన్నైకి తరలిస్తున్నారు. అపోలో ఆసుపత్రిలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మంత్రి  కాకాణి గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు. ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

 

"

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే