కులాలు, మతాలతో రాజకీయం.. నిత్యం ఏదో ఒక కుట్ర : చంద్రబాబుపై కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Aug 18, 2022, 03:35 PM IST
కులాలు, మతాలతో రాజకీయం.. నిత్యం ఏదో ఒక కుట్ర : చంద్రబాబుపై కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు

సారాంశం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు మాజీ మంత్రి కొడాలి నాని. టీడీపీ నేతలు రోజూ ఏదో ఒక కుట్ర చేస్తున్నారని.. ఆ డాక్యుమెంట్ ఫేక్ అని అమెరికాలోని ఎక్లిప్స్ ల్యాబ్ స్పష్టం చేసిందన్నారు

చంద్రబాబు నాయుడు (chandrababu naidu), తెలుగుదేశం పార్టీపై (telugu desam party) విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కొడాలి నాని (kodali nani) . గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు రోజూ ఏదో ఒక కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. గోరంట్ల మాధవ్‌పై ఫేక్ వీడియోతో కుట్ర చేశారని.. అదే వీడియోపై ఫోరెన్సిక్ రిపోర్ట్ అంటూ మరో కుట్ర చేశారని కొడాలి నాని ఆరోపించారు. మతాలపై దుష్ప్రచారం చేసిన వ్యక్తి చంద్రబాబని.. తన భార్యని తాము ఏదో అన్నామని చంద్రబాబు ఏడ్చారంటూ చురకలు వేశారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నీచ రాజకీయాలు చేశారని.. ప్రభుత్వంపై బురద జల్లేందుకు పనికిమాలిన రాజకీయం చేస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు. 

ఆ డాక్యుమెంట్ ఫేక్ అని అమెరికాలోని ఎక్లిప్స్ ల్యాబ్ స్పష్టం చేసిందన్నారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబును నమ్మే పరిస్ధితి లేదని.. కుల, మతాల పేరుతో చంద్రబాబు రాష్ట్రంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు. చంద్రబాబుకు తోడు ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోందని.. అధికారం కోసం ఆయన దిగజారి ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని.. నీచ రాజకీయాలు చేస్తున్న ఆయనకు ప్రజలు మళ్లీ బుద్ధి చెబుతారని కొడాలి నాని అన్నారు. చంద్రబాబుకు పవన్ కల్యాణ్ భజన చేస్తున్నారని.. రెండు చోట్లా ఓడిపోయినా పవన్‌కు బుద్ధి రాలేదని ఆయన ఎద్దేవా చేశారు. 

ALso Read:మాధవ్ వీడియో వ్యవహారం.. లింగ నిర్ధారణలో నిష్ణాతులు, ఏది ఎవరిదో కూడా తేల్చుతారా : టీడీపీపై కొడాలి నాని

గతవారం గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై కొడాలి నాని మాట్లాడుతూ.. అది ఫేక్ వీడియో అని పోలీసులు చెప్పినా టీడీపీ (tdp) రాద్ధాంతం చేయడం సిగ్గుచేటన్నారు. తెలుగు మహిళలు, తెలుగు యువత, తెలుగు వృద్ధులంతా కలిసొచ్చిన వైసీపీని ఏం చేయలేరని నాని స్పష్టం చేశారు. లింగ పరిశోధనలో నిష్ణాతులైన టీడీపీ వాళ్లు.. రాష్ట్రంలో ఏది ఎవరిదో కూడా తేల్చి ఐడీ కార్డులు ముద్రిస్తారా అంటూ కొడాలి ఘాటు వ్యాఖ్యలు చేశారు. శాడిస్టుల మాదిరి సిగ్గు శరం లేకుండా కేసులు పెట్టాలంటున్న ... టీడీపీ ఎవరిపై పెట్టాలో కూడా చెప్పాలని కొడాలి నాని ధ్వజమెత్తారు. 

PREV
click me!

Recommended Stories

సైకిల్ పార్టీనా, సైకో పార్టీనా? ఆర్కే రోజా సంచలన కామెంట్స్ | Asianet News Telugu
Ambati Rambabu Comments: సీఎం చంద్రబాబుపై అంబటి సెటైర్లు | Asianet News Telugu