ఆ ‘‘నలుగురి’’ కోసం ఫ్లైఓవర్లు అడ్డుకుంటారా .. తీవ్ర పరిణామాలు తప్పవు : పురంధేశ్వరికి కొడాలి నాని వార్నింగ్

Siva Kodati |  
Published : Jun 13, 2022, 06:39 PM IST
ఆ ‘‘నలుగురి’’ కోసం ఫ్లైఓవర్లు అడ్డుకుంటారా .. తీవ్ర పరిణామాలు తప్పవు  : పురంధేశ్వరికి కొడాలి నాని వార్నింగ్

సారాంశం

మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత దగ్గుబాటి పురంధేశ్వరీకి వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి కొడాలి నాని. నలుగురి కోసం గుడివాడలో రైల్వే గేట్లపై మంజూరైన ఫ్లైఓవర్లను అడ్డుకుంటారా అంటూ ఆయన విమర్శించారు. 

బీజేపీ నేత (bjp) , కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిపై (daggubati purandeswari) తీవ్ర విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కొడాలి నాని. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గుడివాడలో (gudivada) జరుగుతున్న అభివృద్ధిని పురంధేశ్వరి అడ్డుకుంటున్నారని నాని ఆరోపించారు. గుడివాడకు మంజూరైన ఫ్లై ఓవర్లను నలుగురు వ్యాపారుల కోసం పురంధేశ్వరి అడ్డుకోవడం దారుణమని నాని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (ys jagan) , ఎంపీ వల్లభనేని బాలశౌరి (vallabhaneni balashowry) కృషితో మంజూరైన ఫ్లైఓవర్లను అడ్డుకుంటే తీవ్రపరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. 

ముఖ్యమంత్రి జన్మదినం డిసెంబర్ 21న పూర్తిస్థాయి మౌలిక వసతులతో లబ్ధిదారులకు టిడ్కొ ఇల్లు పంపిణీ చేస్తామని.. అభివృద్ధిని అడ్డుకోవద్దని కొడాలి నాని హితవు పలికారు. వ్యాపార సంస్థల ప్రయోజనాల కోసం ఫ్లైఓవర్ల నిర్మాణంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అపాయింట్ మెంట్‌ను పురందేశ్వరి అడిగారని నాని అన్నారు. గుడివాడ మీదుగా వెళ్లే రైళ్లను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. పురంధేశ్వరి పిచ్చి ప్రయత్నాలను మానుకోవాలని కొడాలి నాని సూచించారు. 

Also Read:వైసిపి ఎమ్మెల్యేలు కొడాలి నాని, వంశీ వేధిస్తున్నారు..: పోలీసులకు టిడిపి మహిళా నేత పిర్యాదు

మరోవైపు.. మాజీ మంత్రి కొడాలి నాని (kodali nani), ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (vallabhaneni vamsi) తనను వేధిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ (TDP) మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్పూరి కల్యాణి ఆరోపించారు. తనను చాలా అసభ్యకరంగా తిడుతున్న ఆడియోను సోషల్ మీడియా ద్వారా పంపారంటూ కల్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను ఇష్టంవచ్చినట్లు తిట్టిన మహిళతో పాటు ఆ ఆడియోను తనకు పంపిన ఎమ్మెల్యేలిద్దరిపై చర్యలు తీసుకోవాలని కల్యాణి హనుమాన్ జంక్షన్ పోలీసులను కోరింది. 

కృష్ణా జిల్లా గన్నవరంలో ఎన్టీఆర్ విగ్రహం కనిపించకుండా వైసిపి నాయకులు భారీ ప్లెక్సీలు ఏర్పాటుచేసారు. ఇటీవల ఎన్టీఆర్ జయంతి రోజున ఈ ప్లెక్సీల గురించి వైసిపి నాయకులను నిలదీసానని... ఇది మనసులో పెట్టుకుని స్థానిక ఎమ్మెల్యే వంశీ తనను టార్గెట్ చేసాడని కల్యాణి తెలిపింది. తన స్నేహితుడైన మరో ఎమ్మెల్యే కొడాలి నానితో కలిసి వంశీ తనకు అసభ్యకరంగా తిడుతున్న ఆడియోను పంపారని కల్యాణి ఆరోపించారు. 

గన్నవరంకు చెందిన రాచేటి రూతమ్మ అనే మహిళతో తనను ఇష్టంవచ్చినట్లు తిట్టించి ఆ ఆడియోను ఈ నెల 10న తనకు సోషల్ మీడియాలో పంపిచారని కల్యాణి వాపోయింది. ఇలా వాట్సాప్ లో పంపిన ఆడియోను కూడా పోలీసులకు అందించింది. ఇలా తనను తిట్టిన మహిళతో పాటు ఎమ్మెల్యేలు కొడాని నాని, వంశీపై చర్యలు తీసుకోవాలని తెలుగు మహిళ  కల్యాణి పోలీసులను కోరారు. ఆమె పిర్యాదును పరిశీలిస్తున్నామని... విచారణ తర్వాత నిజానిజాలను నిర్దారించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం