దమ్ముంటే గుడివాడ, గన్నవరంలలో పోటీ చేయండి : చంద్రబాబు, లోకేష్‌లకు కొడాలి నాని సవాల్

By Siva KodatiFirst Published May 28, 2023, 5:06 PM IST
Highlights

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌లకు మాజీ మంత్రి , వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సవాల్ విసిరారు. దమ్ముంటే గుడివాడ, గన్నవరంలలో పోటీ చేయాలన్నారు. 
 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌లకు మాజీ మంత్రి , వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సవాల్ విసిరారు. ఆదివారం గుడివాడలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన .. రామారావు విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం కొడాలి నాని మాట్లాడుతూ.. స్క్రాప్ బ్యాచ్ అంతా రాజమండ్రిలో మహానాడు పెట్టుకుందంటూ సెటైర్లు వేశారు. ఎన్టీఆర్ పేరు చెప్పుకుని మరోసారి ప్రజలకు వెన్నుపోటు పొడిచేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారంటూ కొడాలి నాని దుయ్యబట్టారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబుకు చెప్పు దెబ్బ తప్పదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు , లోకేష్‌ను తరిమికొట్టి ఎన్టీఆర్ వారసులు ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీని స్వాధీనం చేసుకుంటారని కొడాలి నాని జోస్యం చెప్పారు. చంద్రబాబు, లోకేష్‌లకు దమ్ముంటే గుడివాడ, గన్నవరంలలో పోటీ చేయాలని ఆయన సవాల్ విసిరారు. 

అంతకుముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మహానాడులపై కీలక వ్యాఖ్యలు చేశారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. చంద్రబాబు ఎలాంటి వాడో స్వయంగా ఎన్టీఆర్ చెప్పారని అన్నారు. ఇవాళ ఎన్టీఆర్‌ను పొగడటం మళ్లీ వెన్నుపోటు పోడవటమేనని పేర్కొన్నారు. స్వర్గంలో వున్న ఎన్టీఆర్ కూడా నవ్వాలో, ఏడవాలో అర్ధం కానీ పరిస్ధితి వుందని ఎద్దేవా చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే ఒక్క మగాడంటూ కొనియాడారు. వాళ్లతో వేదిక పంచుకోకుండా జూనియర్ ఎన్టీఆర్ కట్టుబడి వున్నారని ప్రశంసించారు ఆర్జీవీ. రాజమండ్రిలో ఒక జోక్ జరుగుతోందంటూ మహానాడుపై కామెంట్ చేశారు. 

ALso Read: చంద్రబాబు నిజస్వరూపమెంటో రామారావే చెప్పారు.. జూనియర్ ఎన్టీఆర్ ఒక్క మగాడు : రామ్ గోపాల్ వర్మ

ఇదే వేదికపై పోసాని కృష్ణ మురళీ మాట్లాడుతూ.. చంద్రబాబు చేతిలో చనిపోయిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. దేశంలో గుణం లేని వ్యక్తి చంద్రబాబంటూ మండిపడ్డారు. ఏ దిక్కుకైనా వెళ్లొచ్చు కానీ.. చంద్రబాబు వైపు వెళ్లొద్దన్నారు పోసాని. అనంతరం మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. 2 రూపాయలకు కిలో బియ్యం ఎన్టీఆర్ బ్రాండ్ అన్నారు. పేదలకు ఇళ్లు ఇవ్వాలని ఆలోచన చేసిన మొదటి వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. మున్సబ్, కరణం పదవులను రద్దు చేశారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ అమాయకుడు, ఆవేశపరుడు, పేదల వ్యక్తని.. వెన్నుపోటు పొడిచిన వ్యక్తితోనే దండం పెట్టించుకునే దౌర్భగ్యం ఎన్టీఆర్‌దని పేర్ని నాని పేర్కొన్నారు. 

click me!