మహిళలకు అండగా దిశ పోలీసులు...ఆకతాయిల నుండి అమ్మాయిలను కాపాడి

By Arun Kumar PFirst Published May 28, 2023, 1:29 PM IST
Highlights

  వేరు వేరు ఘటనల్లో నలుగురు అమ్మాయిలను కాపాడారు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన దిశ పోలీసులు. 

విజయవాడ : ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు చేసినా, పోలీసులు మరెంత కఠినంగా వ్యవహరించిన అమ్మాయిలపై అఘాయిత్యాలు మాత్రం తగ్గడం లేదు. ఒంటరి మహిళలపై అఘాయిత్యాలు, పెళ్ళిళ్ల పేరిట మోసాలు, సోషల్ మీడియాలో అసభ్య పోలీసులు  ... ఇలా మహిళలు నిత్యం వేధింపులకు గురవుతున్నారు. ఇలా ఒకేరోజు వేధింపులకు గురయిన నలుగురు మహిళలను దిశ పోలీసులు రక్షించిన ఘటన ఆంధ్ర ప్రదేశ్ లో వెలుగుచూసింది.    

 కృష్ణా జిల్లా గుడివాడలో డిప్లోమా చదువుతున్న అమ్మాయి ఒంటరిగా వెళుతుండగా ఓ ఆకతాయి వెంటపడ్డాడు. దీంతో భయంతో పరుగుపెట్టిన యువతి దిశ పోలీసులకు ఫోన్ చేసింది. దీంతో కాల్ లొకేషన్ ట్రేస్ చేసిన పోలీసులు నిమిషాల వ్యవధిలోని బాధితురాలి వద్దకు చేరుకున్నారు. ఆమె వెంటపడుతున్న కోటేశ్వరరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసిన గుడివాడ పోలీసులు విచారణ చేపట్టారు. 

ఇక ఇదే కృష్ణా జిల్లా పెనమలూరులో మరో మైనర్ బాలిక జీవితాన్ని   కాపాడి ఆమె కుటుంబానికి అండగా నిలిచారు దిశ పోలీసులు. మైనర్ కూతురు వివాహం జరపాలని తల్లిదండ్రులు చూడగా అధికారులు అడ్డుకున్నారు. ఐసిడిఎస్ అధికారులకు సూచన మేరకు వివాహాన్ని వాయిదా వేసుకున్నారు మైనర్ బాలిక తల్లిదండ్రులు.

ఇలా తన పెళ్లి రద్దు కావడంతో బాలిక తల్లిదండ్రులతో గొడవకు దిగాడు యువకుడు. ఇంటికి వెళ్లి గొడవకు దిగడంతో భయపడిపోయని యువతి తల్లిదండ్రులు దిశ పోలీసులకు పోన్ చేసారు. దీంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడు రామును అదుపులోకి తీసుకొన్నారు దిశ పోలీసులు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read More  నెల్లూరు బాణసంచా కేంద్రంలో అగ్ని ప్రమాదం: ఐదుగురికి గాయాలు

ఇదిలావుంటే తూర్పుగోదావరి జిల్లా కడియంలో ఓ ఆకతాయి సోషల్ మీడియా వేధింపుల నుండి మహిళను కాపాడారు దిశ పోలీసులు. గుర్తుతెలియని నంబర్ నుండి తనకు 2000 రూపాయలు ఫోన్ పే వచ్చినట్లు... తాను వెంటనే ఆ డబ్బులను తిరిగి పంపించినట్లు మహిళ తెలిపింది. అయితే అదనంగా డబ్బులు వేయాలని... లేదంటే ఫోటో మార్ఫింగ్ చేస్తానని దేవిని ఆగంతకుడు బెదిరించాడు.   దీంతో దిశ పోలీసులకు ఫోన్ చేయగా అతడిని గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. 

ఇలాగే తిరుపతి జిల్లా దొరవారి సత్రం లో తమ మైనర్ అమ్మాయి కనిపించడం లేదని దిశ  పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సూళ్లూరుపేట కు చెందిన వెంకటేశ్వర్లు అనే యువకునితో వెళ్లినట్లుగా గుర్తించారు.   కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన దొరవారి సత్రం పోలీసులు.

click me!