
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మహానాడులపై కీలక వ్యాఖ్యలు చేశారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. చంద్రబాబు ఎలాంటి వాడో స్వయంగా ఎన్టీఆర్ చెప్పారని అన్నారు. ఇవాళ ఎన్టీఆర్‌ను పొగడటం మళ్లీ వెన్నుపోటు పోడవటమేనని పేర్కొన్నారు. స్వర్గంలో వున్న ఎన్టీఆర్ కూడా నవ్వాలో, ఏడవాలో అర్ధం కానీ పరిస్ధితి వుందని ఎద్దేవా చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే ఒక్క మగాడంటూ కొనియాడారు. వాళ్లతో వేదిక పంచుకోకుండా జూనియర్ ఎన్టీఆర్ కట్టుబడి వున్నారని ప్రశంసించారు ఆర్జీవీ. రాజమండ్రిలో ఒక జోక్ జరుగుతోందంటూ మహానాడుపై కామెంట్ చేశారు.
ఇదే వేదికపై పోసాని కృష్ణ మురళీ మాట్లాడుతూ.. చంద్రబాబు చేతిలో చనిపోయిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. దేశంలో గుణం లేని వ్యక్తి చంద్రబాబంటూ మండిపడ్డారు. ఏ దిక్కుకైనా వెళ్లొచ్చు కానీ.. చంద్రబాబు వైపు వెళ్లొద్దన్నారు పోసాని. అనంతరం మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. 2 రూపాయలకు కిలో బియ్యం ఎన్టీఆర్ బ్రాండ్ అన్నారు. పేదలకు ఇళ్లు ఇవ్వాలని ఆలోచన చేసిన మొదటి వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. మున్సబ్, కరణం పదవులను రద్దు చేశారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ అమాయకుడు, ఆవేశపరుడు, పేదల వ్యక్తని.. వెన్నుపోటు పొడిచిన వ్యక్తితోనే దండం పెట్టించుకునే దౌర్భగ్యం ఎన్టీఆర్‌దని పేర్ని నాని పేర్కొన్నారు.