టీడీపీ - జనసేన పొత్తు .. గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు

By Siva Kodati  |  First Published Oct 5, 2023, 6:31 PM IST

టీడీపీ, జనసేన పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. పవన్ వారాహి యాత్రకు, లోకేష్ పాదయాత్రకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ చంద్రబాబే రాష్ట్రానికి సీఎం అవుతారని జోస్యం చెప్పారు.


టీడీపీ, జనసేన పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మళ్లీ చంద్రబాబే రాష్ట్రానికి సీఎం అవుతారని జోస్యం చెప్పారు. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ దేశ , విదేశాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. జగన్ ఆర్ధిక నేరస్తుడని.. 16 నెలలు జైల్లో వున్నారని, పదేళ్ల నుంచి బెయిల్ మీద వున్న వ్యక్తి అంటూ గంటా దుయ్యబట్టారు.

ఐదేళ్ల నుంచి జగన్ కోర్టు మెట్లు ఎక్కని వ్యక్తని.. అలాంటిది చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని జనం జీర్ణించుకోలేకపోతున్నారని శ్రీనివాసరావు పేర్కొన్నారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. పవన్ వారాహి యాత్రకు, లోకేష్ పాదయాత్రకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Latest Videos

Also Read: ఏపీ నుంచి ‘‘లులూ’’ను తరిమేశారు .. తెలంగాణ వెల్‌కమ్ చెప్పింది, కేటీఆర్ ఫోటోతో జగన్‌పై గంటా ఫైర్

అంతకుముందు గత వారం హైదరాబాద్‌లో లులూ గ్రూప్ నిర్మించిన అతిపెద్ద షాపింగ్ మాల్ ఓపెనింగ్ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు గంటా శ్రీనివాసరావు. ‘విశాఖలో 'లులూ’ను తరిమేశారు. మీకొక వందనం... ఇక్కడ ఉండలేం...అని చెప్పి వెళ్లిపోయినా 'లులూ'కు హైదరాబాద్‌లో ఘన స్వాగతం పలికారు. జగన్‌రెడ్డి "స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం"తో విసిగిపోయిన 'లులూ' అసలు ఏపీ(AP)లో పెట్టుబడులే పెట్టమని చెప్పేసింది. మీ రివర్స్‌ పాలనతో విశాఖలో 5 వేల మంది యువతకి ఉపాధిని దూరం చేశారు’’ అంటూ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా లులూ గ్రూప్ అధినేతతో చంద్రబాబు వున్న ఫోటోను, హైదరాబాద్ లులూ షాపింగ్ మాల్‌ను కేటీఆర్ ఓపెన్ చేసిన ఫోటోను గంటా శ్రీనివాసరావు షేర్ చేశారు. 

click me!