తాడేపల్లిగూడెంలో ఆక్రమణల తొలగింపు, ఉద్రిక్తత

By Siva KodatiFirst Published Jun 25, 2019, 12:30 PM IST
Highlights

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో ఆక్రమణల తొలగింపు ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక నరసింహారావుపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన భూములలో కొందరు ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్నారు

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో ఆక్రమణల తొలగింపు ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక నరసింహారావుపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన భూములలో కొందరు ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్నారు.

దీంతో మంగళవారం దేవాదాయశాఖ అధికారులు.. పోలీసుల సాయంతో ఆక్రమణలను తొలగించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తమ ఇళ్లను కూల్చేస్తున్నారంటూ స్థానికులు-అధికారులతో వాగ్వాదానికి దిగారు.

తమ ఇళ్లను తొలగిస్తున్న సమయంలో వాహనాలకు అడ్డుగా నిలబడి నిరసన తెలిపారు . చాలా చోట్ల ఆలయ భూముల్లో అక్రమంగా ఇల్లు కట్టుకున్నారని.. వాటిని వదిలేసి తమ ఇళ్లను మాత్రమే కూల్చివేయడం దారుణమని స్థానికులు అధికారులు వాగ్వాదానికి దిగారు.

ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పోలీసులు భారీగా అక్కడికి చేరుకుని జనాన్ని లాగి పారేశారు. 

click me!