ఏపికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకుంది కేసీఆరే: డొక్కా

By Arun Kumar PFirst Published Dec 13, 2018, 7:52 PM IST
Highlights

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తే ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్సార్‌సిపి, జనసేన కార్యకర్తలు సంబరాలు చేసుకోడాన్ని మాజీ మంత్రి, టిడిపి నాయకులు డొక్కా మాణిక్య వరప్రసాద్ తప్పుబట్టారు. ఏపికి ప్రత్యేక హోదా రాకపోవడానికి కేసీఆరే కారణమంటూ డొక్కా సంచలన వ్యాఖ్యలు చేశారు. 

రాష్ట్ర విభజన సందర్భంగా ఎంతో నష్టపోతున్న ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సుముఖత వ్యక్తం చేశారని డొక్కా గుర్తుచేశారు. కానీ ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్ అందుకు ససేమిరా ఒప్పుకోకపోవడంతో వెనక్కి తగ్గారని అన్నారు. ఇలా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసిన వ్యక్తి గెలిస్తే సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని డొక్కా విమర్శించారు. 

ఇలాంటి స్వార్థపూరిత రాజకీయాలు చేస్తూ వైఎస్సార్ సిపి, జనసేనలు ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాయో అర్థం కావడం లేదని డొక్కా పేర్కొన్నారు. తెలంగాణ టిఆర్ఎస్ నాయకులతో కొంత మంది ఏపి నాయకులు కుమ్మకై టిడిపిని విమర్శిస్తున్నారని డొక్కా తెలిపారు. 

బిజెపి పార్టీని ఇటీవల జరిగిన ఎన్నికల్లో అన్ని రాష్ట్రాలు తిరస్కరించాయని విమర్శించారు. అలాంటి పార్టీకి మద్దతుగా నిలిచే పార్టీలకు కూడా అదే గతి పడుతుందని డొక్కా పరోక్షంగా వైఎస్సార్ సిపి పార్టీని విమర్శించారు. 

click me!