వైసీపీకి సింగిల్ డిజిట్ కష్టమే.. పవన్‌కు అనుభవం లేదు, చంద్రబాబు అయితేనే : డీఎల్ రవీంద్రా రెడ్డి వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Dec 21, 2022, 2:27 PM IST
Highlights

వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మాజీ మంత్రి డాక్టర్ డీఎల్ రవీంద్రా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్ధితుల్లో చంద్రబాబు మాత్రమే రాష్ట్రాన్ని కాపాడగలరని ఆయన వ్యాఖ్యానించారు. 

మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సింగిల్ డిజిట్ వస్తే గొప్పేనన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబు మాత్రమే రాష్ట్రాన్ని కాపాడుతారని డీఎల్ జోస్యం చెప్పారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఏపీని కాపాడాలని ఆయన ఆకాంక్షించారు. పవన్ కల్యాణ్‌కు నిజాయితీ వున్నా పాలనలో అనుభవం లేదని డీఎల్ రవీంద్రా రెడ్డి అన్నారు. సీఎం అయిన నాటి నుంచే జగన్ అవినీతికి పాల్పడ్డారంటూ ఆయన ఆరోపించారు. 

వైసీపీలో వున్నందుకు అసహ్యంగా వుందన్నారు. తాను ఇంకా వైసీపీలోనే వున్నానని.. వారేమీ తనను తప్పించలేదని డీఎల్ వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో గుర్తింపు పొందిన పార్టీ నుంచే తాను పోటీ చేస్తానని రవీంద్రా రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ వివేకా కేసులో సుప్రీం తీర్పు తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో ఒంటరిగా పోరాడుతున్న సునీత ధైర్యాన్ని డీఎల్ రవీంద్రా రెడ్డి ప్రశంసించారు. 

Also REad: వివేకా హత్యను రాజకీయాలకు వాడుకున్నారు.. కీలక వ్యక్తులకు ఘటనతో సంబంధం: డీఎల్ రవీంద్రారెడ్డి సంచలనం

కాగా.. కడప జిల్లా మైదుకూరు నుంచి 1978 నుంచి 2009 వరకు జరిగిన ఎన్నికల్లో ఆరుసార్లు ఘన విజయం సాధించారు డీఎల్ రవీంద్రా రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడైన ఆయన రాష్ట్ర విభజన తర్వాత కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా వున్నారు. టీడీపీలోకి రావాలని ప్రయత్నించినప్పటికీ.. స్థానిక నేత పుట్టా సుధాకర్ యాదవ్ బలంగా వుండటంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. అయితే 2019లో వైసీపీకి జై కొట్టిన డీఎల్‌కు జగన్ సరైన గుర్తింపునివ్వలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

click me!