వైసీపీలో త్వరలో తిరుగుబాటు.. 80 మంది ఎమ్మెల్యేలు, ఏ క్షణమైనా : దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Sep 25, 2022, 07:34 PM IST
వైసీపీలో త్వరలో తిరుగుబాటు.. 80 మంది ఎమ్మెల్యేలు, ఏ క్షణమైనా : దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు

సారాంశం

వైసీపీలో త్వరలో తిరుగుబాటు తప్పదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. దాదాపు 80 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసేందుకు సిద్ధంగా వున్నారని దేవినేని పేర్కొన్నారు.  

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నందివాడ మండలంలో జరిగిన అమరావతి రైతుల పాదయాత్రలో మాజీ మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్రలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీలో తిరుగుబాటు జరిగే అవకాశం వుందని వ్యాఖ్యానించారు. దాదాపు 80 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసేందుకు సిద్ధంగా వున్నారని దేవినేని పేర్కొన్నారు. సొంత ఎమ్మెల్యేలనే కాపాడుకోలేని జగన్.. కుప్పంలో ఏం చేస్తారంటూ ఉమా దుయ్యబట్టారు. 

వైసీపీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, కుట్రలకు పాల్పడినా గుడివాడలో అమరావతి రైతులు విజయవంతంగా పాదయాత్ర నిర్వహించారని దేవినేని ఉమా పేర్కొన్నారు. రైతుల పాదయాత్రను అడ్డుకోవడానికి స్థానిక ఎమ్మెల్యే వీధి లైట్లు తీయించాడని ఆయన ఆరోపించారు. ఆ స్థాయికి బూతుల మంత్రి దిగజారాడని కొడాలి నానిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. విశాఖలో వైసీపీ నేతలు భూముల ఆక్రమణలకు పాల్పడుతోన్నారని దేవినేని ఉమా ఆరోపించారు.

ALso REad:కొడాలి నాని ఇలాకాలో చింతమనేని ప్రభాకర్ క్రేజ్ చూడండి...

అంతకుముందు గుడివాడలో పరిస్థితుల నేపథ్యంలో రైతు పాదయాత్రలో పాల్గొనేందుకు బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసారు. కానీ ఆయన తన కారులో కాకుండా పోలీసుల కళ్లుగప్పి బైక్ పై గుడివాడకు చేరుకున్నారు. పాదయాత్రలో పాల్గొన్న చింతమనేనిని అభిమానులు భుజానెత్తుకుని అభిమానం చాటుకున్నారు. ఇలా కొడాలి నాని ఇలాకాలో టిడిపి ఎమ్మెల్యే చింతమనేని సందడి చేసాడు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్
Bus Accident : అల్లూరి జిల్లాలో ఘోరం.. బస్సు ప్రమాదంలో 15మంది మృతి