రెండేళ్లుగా పోలవరానికి కొర్రీలు.. రివర్స్ టెండరింగ్ కాదు, రివర్స్ గేర్ : వైఎస్ జగన్‌పై దేవినేని వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jan 14, 2023, 3:56 PM IST
Highlights

పోలవరం ప్రాజెక్ట్‌ విషయంలో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా ఫైర్ అయ్యారు. 43 నెలలుగా ఢిల్లీ వెళ్లిరావడం తప్ప ఏం సాధించారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన దుయ్యబట్టారు. 

వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రివర్స్ టెండరింగ్‌తో పోలవరానికి రివర్స్ గేర్ పడిందన్నారు. పోలవరం అంశంలో రాజకీయాలకు అతీతమైన సంబంధం వుందని...ఆర్ధిక శాఖ కొర్రీలు వేసి రెండేళ్లు దాటినా, ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని దేవినేని ఉమా దుయ్యబట్టారు. ఇప్పటికీ డీపీఆర్ 2కి దిక్కులేదని, 31 మంది ఎంపీలు వుండి ఏం చేస్తున్నారని ఉమా ఎద్దేవా చేశారు. 43 నెలలుగా ఢిల్లీ వెళ్లిరావడం తప్ప ఏం సాధించారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాగా.. ఇటీవల దేవినేని ఉమా టార్గెట్‌గా వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్  ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరతానని దేవినేని ఉమా భయపడుతున్నారని అన్నారు. తాను టీడీపీలో చేరితే ఆయన సీటుకు ఎసరొస్తుందని భయం పట్టుకుందని అన్నారు. తనతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును తిట్టించాలని దేవినేని ఉమా చూస్తున్నారని చెప్పారు. తన జోలికి రానిదే తాను ఎవరి జోలికి వెళ్లనని అన్నారు. మంత్రి జోగి రమేష్‌తో తనకు చిన్న విభేదాలు ఉన్నాయని.. వాటిని దేవినేని ఉమా భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 

ALso REad: నేను టీడీపీలో చేరతానని దేవినేని ఉమా భయపడుతున్నాడు.. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్

తాను పదవులకు లొంగేవాడిని కాదని.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఇంటికి పిలిపిస్తే నమస్కారం పెట్టి వచ్చేశానని చెప్పారు. ఆయన తనను గౌరవించారని.. తాను కూడా ఆయనను గౌరవించానని తెలిపారు. అకారణంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లను తిట్టాల్సిన అవసరం తనకు లేదని తెలిపారు. తాను దేవినేని ఉమాను మాత్రమే తిడతానని అన్నారు. దేవినేని ఉమా తనను ఏమి అనకపోతే.. తాను కూడా ఆయనను ఏమి అననని అన్నారు. దేవినేని ఉమాను ఇంట్లో అందరవి ఆడవాళ్ల పేర్లేనని చెప్పారు.  


 

click me!