కోడి పందాల నిర్వాహకుల సరికొత్త ఐడియా.. బుల్లెట్ బైక్ ఆఫర్.. ఎక్కడంటే..

Published : Jan 14, 2023, 02:57 PM IST
కోడి పందాల నిర్వాహకుల సరికొత్త ఐడియా.. బుల్లెట్ బైక్ ఆఫర్.. ఎక్కడంటే..

సారాంశం

కోడి పందాల నిర్వహకులు కొందరు సరికొత్త ఐడియాతో ముందుకొచ్చారు. కోడిపందాల బరులు సంఖ్య ఎక్కువగా ఉండటంతో.. పందెం రాయుళ్లను ఆకర్షించేందుకు నిర్వాహకులు ఆఫర్లు ప్రకటిస్తున్నారు.

సంక్రాంతి పండగ వేళ ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో కోడి పందాల బరులు వెలిశాయి. అయితే కృష్ణా జిల్లాలో కోడి పందాల నిర్వహకులు కొందరు సరికొత్త ఐడియాతో ముందుకొచ్చారు. కోడిపందాల బరులు సంఖ్య ఎక్కువగా ఉండటంతో.. పందెం రాయుళ్లను ఆకర్షించేందుకు నిర్వాహకులు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. విజేతలకు బుల్లెట్ బైక్, స్కూటీలను అందజేస్తామని చెబుతున్నారు. కోడి పందాల బరులనిర్వాహకుల మధ్య పోటీ విపరీతంగా ఉండడంతో.. కొందరు ఈ కొత్త తరహా విధానాన్ని అనుసరిస్తున్నారు. 

వివరాలు.. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో నిర్వాహకులు కోడి పందాలు ఆడేవారికి బుల్లెట్ బండి, స్కూటీలను ఆఫర్లుగా ప్రకటించారు. గుడ్లవల్లేరు మండలంలో  6 బరులు ఉన్నాయి. దీంతో నిర్వాహకుల మధ్య పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే కౌతవరం, వేమవరం నిర్వాహకులు పందెంరాయుళ్లను ఆకర్షించేందుకు ఆఫర్లు ప్రకటించారు.

రూ. 2 లక్షల విలువైన కోడిపందాలను వరుసగా ఐదుసార్లు ఆడితే రూ. 1.75 లక్షల విలువైన బుల్లెట్ బండిని, లక్ష విలువైన పందేలు వరుసగా ఐదుసార్లు ఆడితే స్కూటీని బహుమతులుగా అందించనున్నట్టు ప్రకటించారు. ఆఫర్ ప్రకటించడం మాత్రమే కాకుండా.. బరుల వద్ద బుల్లెట్ బండి, స్కూటీలను తీసుకొచ్చి కూడా ఉంచారు. 

ఇక, ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి వేళ మూడు రోజుల పాటు కోడి పందాలు జరిపేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకున్నారు. రాత్రి వేళలో కూడా పందాలు  కొనసాగేలా బరుల వద్ద  ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేశారు. పందెంలో బరిలో దింపే కోళ్లకు కొన్ని నెలల ముందు నుంచే ప్రత్యేక శిక్షణ ఇచ్చి బరుల్లో దింపుతున్నారు. కోడి పందాల్లో పాల్గొనేందుకు ఇతర ప్రాంతాల నుంచి పందెం రాయుళ్లు ఏపీకి భారీ చేరుకుంటున్నారు. కొన్నిచోట్ల కోడి పందాలను ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు నిర్వహిస్తున్నారు. కోడి పందాల్లో కోట్లలో డబ్బు చేతులు మారనుంది. కొన్నిచోట్ల కోడి పందాలతో పాటు గుండాట బరులు వెలిశాయి. గుండాటలో కూడా లక్షల రూపాయలు చేతులు మారనుంది. కోడి పందాల్లో పాల్గొనేవారి కోసం పలుచోట్ల క్యూ ఆర్ కోడ్ పేమెంట్ సౌకర్యం కల్పిస్తున్నారు.

అయితే కోడి పందాలను అడ్డుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్న.. నిర్వాహకులు మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. చాలా చోట్ల ప్రజాప్రతినిధుల కన్నుసన్నల్లో కోడి పందాలు నిర్వహిస్తుండటంతో పోలీసులు కూడా చూసిచూడనట్టుగా వ్యవహరిస్తారనే ప్రచారం కూడా ఉంది. అయితే సంప్రదాయం ముసుగులో కొన్ని చోట్ల పందెంరాయుళ్లు నిర్వాహకులు కోళ్ళకు కత్తి కట్టి బరిలోకి దింపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Independence Day Celebrations | Nara Bhuvaneswari | Asianet Telugu
CM Chandrababu Highlights @Independenceday 2026 | Asianet Telugu