మాజీ మంత్రికి తప్పిన ప్రమాదం...కారు ఢీకొన్న వ్యక్తికి తీవ్ర గాయాలు

Published : Aug 22, 2018, 03:40 PM ISTUpdated : Sep 09, 2018, 01:43 PM IST
మాజీ మంత్రికి తప్పిన ప్రమాదం...కారు ఢీకొన్న వ్యక్తికి తీవ్ర గాయాలు

సారాంశం

మాజీ మంత్రి,  వైఎస్సార్ సిపి పార్టీ కీలక నేత బాలినేని శ్రీనివాస రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయ్యింది. అయితే ఈ ప్రమాదం నుండి ఆయన క్షేమంగా బైటపడ్డారు.

మాజీ మంత్రి,  వైఎస్సార్ సిపి పార్టీ కీలక నేత బాలినేని శ్రీనివాస రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయ్యింది. అయితే ఈ ప్రమాదం నుండి ఆయన క్షేమంగా బైటపడ్డారు.

ఇవాళ ఉదయం బాలినేని తన కారులో ప్రకాశం జిల్లాలోని ఒంగోలు నుండి త్రోవకుంటకు వెళుతుండగా మార్గ మధ్యలో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతుండగా కారు టైరు పేలడంతో ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకుపోయింది. ఈ క్రమంలో కారు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో వాహనదారుడు మార్నేని అంజనేయులుకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఈ ప్రమాదంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఎలాంటి గాయాలు కాలేదు. కారు అదుపుతప్పినప్పటికి రోడ్డు పక్కనే ఆగిపోవడంతో ప్రమాద తీవ్రత తగ్గినట్లు తెలుస్తోంది.   
  
PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్