ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా...

By narsimha lodeFirst Published Aug 22, 2018, 3:10 PM IST
Highlights

వివాహేతర సంబంధం కారణంగా  డబ్బు, నగలే కాకుండా చివరకు ప్రాణాలే పోయాయి. 12 ఏళ్ల పాటు వివాహేతర సంబంధం కొనసాగించిన వ్యక్తే తన ప్రియురాలు కళ్యాణిని  హరనాథ్ హత్య చేశాడు

నెల్లూరు: వివాహేతర సంబంధం కారణంగా  డబ్బు, నగలే కాకుండా చివరకు ప్రాణాలే పోయాయి. 12 ఏళ్ల పాటు వివాహేతర సంబంధం కొనసాగించిన వ్యక్తే తన ప్రియురాలు కళ్యాణిని  హరనాథ్ హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించి 17 రోజుల్లోనే నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు పోలీసులు.  ఈ కేసును చేధించిన పోలీసులకు రివార్డులు అందిస్తామని గూడూరు డీఎస్పీ రాంబాబు ప్రకటించారు. 

ఆగష్టు 3వ తేదీ నెల్లూరు జిల్లాలోని మనుబోలు వద్ద జాతీయ రహదారి పక్కనే ఉన్న వెంకయ్యస్వామి ఆశ్రమం  వద్ద  కళ్యాణి హత్యకు గురైంది.కళ్యాణిని హత్య చేసిన  నిందితుల వివరాలను గూడూరు డీఎస్పీ రాంబాబు  మంగళవారం నాడు  ప్రకటించారు. 

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఇస్కపాలెం గ్రామానికి చెందిన బిరదవోలు కళ్యాణిని ఆమె ప్రియుడు  హరనాథ్ , అతని స్నేహితుడు వెంకటయ్య హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు.  కళ్యాణి, ఆమె భర్త వేణుగోపాల్ రెడ్డి  సైదాపూరంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. వీరి ఇంటికి సమీపంలోనే పోతుగుంట హరనాథ్‌తో కళ్యాణికి పరిచయం ఏర్పడింది. 

2006 నుండి  కళ్యాణితో హరనాథ్ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే కళ్యాణి వద్ద నుండి నగలు, డబ్బులను తీసుకొనేవాడు.  వాటిని తిరిగి ఇచ్చేవాడు కాదు.  2010లో హరనాథ్ వివాహమైంది. పెళ్లైనా కళ్యాణితో  హరనాథ్  వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. 2014లో హరనాథ్ భార్యను వదిలేశాడు.

2015లో కళ్యాణి భర్త అనారోగ్యంతో మృతి చెందాడు.. అయితే వీరిద్దరూ ఏకాంతంగా కలుసుకొంటున్నారు.  అయితే 2018లో హరనాథ్ రెండో పెళ్లి చేసుకొన్నాడు.  అయితే హరనాథ్ రెండో పెళ్లి చేసుకోవడాన్ని కళ్యాణి తీవ్రంగా వ్యతిరేకించింది. తానుండగా రెండో పెళ్లి ఎందుకు చేసుకొంటున్నావని  హరనాథ్‌ను వేధించింది. మరో వైపు  తన నగలు, డబ్బులను ఇవ్వాలని కూడ హరనాథ్ ను డిమాండ్ చేసింది.

కళ్యాణి అడ్డు తొలగించుకోకపోతే  భవిష్యత్తులో కష్టమని హరనాథ్ భావించాడు.  దీంతో తన స్నేహితుడు  పసుపులేటి వెంకయ్యతో కలిసి  కళ్యాణి హత్యకు పథకాన్ని రచించాడు. స్నేహితుడిని తన స్కూటర్‌పై ఆగష్టు 3 వ తేదీన మనుబోలు సమీపంలోని వెంకయ్యస్వామి ఆశ్రమం వద్దకు చేరుకొన్నారు. ఆశ్రమానికి వచ్చే సమయంలోనే రెండు లీటర్ల పెట్రోల్, రెండు బ్లేడ్లను హరనాథ్ తెచ్చాడు.

కాగితాలపూర్ క్రాస్ రోడ్డు వద్ద బస్సు దిగిన కళ్యాణిని హరనాథ్ తన బైక్‌పై వెంకయ్యస్వామి ఆశ్రమం వద్దకు తీసుకొచ్చాడు.  అప్పటికే ఆశ్రమం వద్ద  చీకట్లో వెంకటయ్య నక్కాడు.  కళ్యాణిని తీసుకొచ్చి మద్యం తాగుతూ హరనాథ్ మాటలు కలిపాడు.  రెండో పెళ్లి ఎందుకు చేసుకొన్నావంటూ కళ్యాణి  హరనాథ్‌ను నిలదీసింది.  ఈ క్రమంలోనే  తన వెంట తెచ్చుకొన్న బ్లేడ్ తో కళ్యాణి గొంతు కోశాడు హరనాథ్. మరోవైపు వెంకటయ్య  కూడ మరో బ్లేడ్ తో  ఆమెను వెనుక నుండి గొంతు కోశాడు. 

పెట్రోల్ పోసి  మృతదేహాన్ని దగ్దం చేశారు.  మృతదేహం వద్ద ఉన్న వస్తువలు ఆధారంగా కళ్యాణిదిగా కుటుంబసభ్యులు గుర్తించారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కళ్యాణిని హత్య చేసిన నిందితులను  గుర్తించిన  వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

 
 

click me!