శాడిస్టు, పనికిమాలిన వ్యక్తి.. దొంగోడిని సీఎంగా చేసుకున్నాం: జగన్‌పై అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : May 28, 2022, 04:52 PM IST
శాడిస్టు, పనికిమాలిన వ్యక్తి.. దొంగోడిని సీఎంగా చేసుకున్నాం: జగన్‌పై అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు

సారాంశం

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మహానాడు వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. రాష్ట్రం తగలబడిపోతోందని, అప్పుల పాలైపోయిందని, అన్ని వర్గాల వారికి నష్టం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

ఒక శాడిస్టు, పనికిమాలిన వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా (ys jagan) వున్నాడంటూ అయ్యన్నపాత్రుడు (chintakayala ayyanna patrudu) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక దొంగోడికి, 14 నెలలు జైల్లో వున్న వ్యక్తికి ఓట్లు వేసి రాష్ట్రాన్ని పాడు చేసుకున్నామని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం ఒంగోలులో జరుగుతున్న మహానాడులో (mahanadu) ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం తగలబడిపోతోందని, అప్పుల పాలైపోయిందని, అన్ని వర్గాల వారికి నష్టం జరిగిందని అయ్యన్నపాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ  తెలుగుదేశం పార్టీ జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిందని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబు (chandrababu naidu) కేంద్రంలో చక్రం తిప్పి.. బాలయోగిని (gmc balayogi) స్పీకర్‌గా చేశారని అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. రాజకీయాల్లోకి  బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, మహిళలు వచ్చారంటే దానికి కారణం ఎన్టీఆర్ అన్నారు మాజీ మంత్రి, టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు.  40 సంవత్సరాల పాటు ఈ పార్టీని నడిపించుకుంటూ వచ్చామని గుర్తుచేశారు. తమ వయసు పెరుగుతోందని.. మరో నలభై ఏళ్లు మీరంతా నడిపించాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 

Also Read:NTR Jayanti: వాళ్లకు బస్సులు ఉంటే.. మాకు జనాలు ఉన్నారు: చంద్రబాబు నాయుడు

అంతకుముందు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జయంతి (ntr jayanthi) సందర్భంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఒంగోలులోని అద్దెంకి బస్టాండ్ సెంటర్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ప్రస్తుతం.. మహానాడు జరుగుతున్న ఒంగోలు ఉన్న చంద్రబాబు.. తాను బస చేసిన చోటు నుంచి భారీ ర్యాలీతో అద్దెంకి బస్టాండ్ సెంటర్‌కు చేరుకున్న చంద్రబాబు.. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.  అక్కడ అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను చంద్రబాబు కట్ చేశారు. 

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగు ప్రజల పౌరుషం ఎన్టీఆర్‌ అని అన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. పేదల సంక్షేమం కోసం పాటుపడిన మహావ్యక్తి అని కొనియాడారు. తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్‌ చిరస్థాయిగా నిలిచిపోతారని చంద్రబాబు పేర్కొన్నారు. 

జనాలు రావాలని అనుకుంటున్న మహానాడుకు ప్రభుత్వం బస్సులు ఇవ్వడం లేదని వైసీపీ సర్కార్‌పై చంద్రబాబు మండిపడ్డారు. ఎవరూలేని యాత్రకు మాత్రం ఏసీ బస్సులు తిప్పుతుందని ఎద్దేవా చేశారు. మహానాడుకు ఎవరూ రాకుండా అడ్డుకునేందుకు బస్సులకు అనుమతి ఇవ్వలేదన్నారు. తప్పుడు రాజకీయాలకు ప్రజలు ఆమోదించరని జగన్ తెలుసుకోవాలన్నారు. తమకు జనాలు ఉన్నారని.. వాళ్లకు బస్సులు ఉన్నాయని కామెంట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే