జగన్ గెటవుట్ అన్నా.. ఫాలోవర్‌గానైనా వుంటా, ఫేక్ వార్తలపై తేల్చేసిన అనిల్ కుమార్ యాదవ్

Siva Kodati |  
Published : May 18, 2023, 02:26 PM IST
జగన్ గెటవుట్ అన్నా.. ఫాలోవర్‌గానైనా వుంటా, ఫేక్ వార్తలపై తేల్చేసిన అనిల్ కుమార్ యాదవ్

సారాంశం

గెటవుట్.. గెట్ లాస్ట్ అని జగన్ అన్నా.. తాను మాత్రం ఫాలోవర్‌గానే వుంటానని స్పష్టం చేశారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. రాజకీయాల్లో కొనసాగినంత కాలం జగనన్నతోనే తన ప్రయాణం అని ఆయన తెలిపారు. 

తన పేరుతో సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ న్యూస్‌పై ఏపీ మాజీ మంత్రి , వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఘాటుగా స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన పేరుతో తప్పుడు వార్తలతో ప్రచారం చేసినంత మాత్రాన ఈ ఫేక్ గాళ్లకు ఒరిగేదేం లేదన్నారు. తన పేరును వాడుకుని డబ్బులు సంపాదించుకుంటూ, సుఖంగా వున్నారంటే దానిని కూడా స్వాగతిస్తానన్నారు. తన తండ్రి సాక్షిగా రాజకీయాల్లో కొనసాగినంత కాలం జగనన్నతోనే తన ప్రయాణం అని అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. 

జగన్ తనను తరిమేసే పరిస్ధితి ఎన్నటికీ రాదన్న ఆయన.. ఒకవేళ అదే జరిగినా చివరి శ్వాస వరకు జగన్‌ కోసమే పనిచేస్తానని తేల్చేశారు. పేరున్న గొర్రెల్లో ఒక గొర్రెగా వుండే కంటే.. ఒంటరిగా సింహంలా ఉండటమే మంచిదంటూ అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. మోకాలి సమస్య కారణంగా తాను గత కొన్ని రోజులుగా నియోజకవర్గానికి దూరంగా వుంటున్నానని.. దయచేసి దీనిపై తప్పుడు వార్తలు రాయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. చికిత్స పూర్తి చేసుకుని కోలుకున్న వెంటనే తిరిగి ప్రజలకు అందుబాటులో వుంటానని అనిల్ కుమార్ యాదవ్ స్పస్టం చేశారు. గెటవుట్.. గెట్ లాస్ట్ అని జగన్ అన్నా.. తాను మాత్రం ఫాలోవర్‌గానే వుంటానని అనిల్ తెలిపారు. 

ALso Read: వాళ్లంతా ఇప్పుడు ఈగలు తోలుకుంటున్నారు.. కోటంరెడ్డి టార్గెట్‌గా అనిల్ కుమార్ యాదవ్ పరోక్ష వ్యాఖ్యలు

ఇకపోతే..మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నిర్వేదంలో కూరుకుపోయినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన కొద్దిరోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మంత్రి పదవి నుంచి తొలగించి మంచి పనిచేశారని వ్యాఖ్యానించారు. పదవి పోయిన తర్వాత ఎవరు తనతో వున్నారో.. ఎవరు వుండరో అర్ధమైందని అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. పలువురు కార్పోరేటర్లు తనను వీడినా బాధపడనని.. 2014లో బలమైన వర్గానికి చెందిన మేయర్‌తో పాటు పలువురు కార్పోరేటర్లు తనను విడిచిపెట్టారని అనిల్ కుమార్ గుర్తుచేశారు. ఇప్పుడు తనను ఎందుకు వీడారో అర్ధం కాలేదన్నారు. తనను వీడినవాళ్లు అనిల్ అన్యాయం చేశాడా.. అని ఒక్కసారి ప్రశ్నించుకోవాలని సూచించారు. 

తన ప్రత్యర్ధి రూ.180 కోట్లు ఖర్చు పెట్టినా తానే గెలిచానని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఆర్య వైశ్య సంఘం కార్యక్రమంలో అందరూ రూ.100 కోట్లు పైబడి ఆస్తులు వున్నవారు వున్నారని ఆయన తెలిపారు. వేదిక మీద అంతా వెయిట్ వున్నవాళ్లు వున్నారని.. తనకు వెయిట్ లేదని తనను పిలవలేదేమో అంటూ అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. తన రాజకీయ జీవితంలో పోట్లు కొత్త కాదని ఆయన అన్నారు. రాజకీయ జీవితంలో కొంతమంది కలుస్తారు.. కొంతమంది వెళ్తారని అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలు తనకు చాలా కష్టం అంటున్నారని.. తాను ఎవరికీ అన్యాయం చేయలేదని ఆయన అన్నారు. ప్రజలే తన వెంట వున్నారని అనిల్ చెప్పారు. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్