వైఎస్ వివేకాహత్య కేసులో సీబీఐకిచ్చిన సమాచారం ఎలా లీకైంది: అజయ్ కల్లాం

By narsimha lode  |  First Published May 18, 2023, 1:43 PM IST


వైఎస్ వివేకానందరెడ్డి  హత్య  కేసులో  తాను ఇచ్చిన సమాచారం  ఎలా లీకైందని  ఏపీ రాష్ట్ర ప్రభుత్వ  మాజీ   ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లాం   సీబీఐని ప్రశ్నించారు. 


అమరావతి:వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో  సీబీఐ అధికారులకు  ఇచ్చిన సమాచారం ఎలా లీకైందని  ఏపీ రాష్ట్ర ప్రభుత్వ  మాజీ  ప్రధాన కార్యదర్శి  అజయ్ కల్లాం  ప్రశ్నించారు.

గురువారంనాడు  తాడేపల్లిలో  అజయ్ కల్లాం  మీడియాతో మాట్లాడారు.  వైఎస్ వివేకానందరెడ్డి  హత్య  కేసులో  సీబీఐకి తాను ఇచ్చిన వాంగ్మూలం  మీడియాలో  రావడంపై  ఆశ్చర్యం వ్యక్తం  చేశారు.   సీబీఐ అధికారికి తాను  చెప్పిన విషయాలు ఎలా లీకయ్యాయని ఆయన  ప్రశ్నించారు. దర్యాప్తు  అంశాలు  ఎలా  బయటకు వచ్చాయని ఆయన అడిగారు. దర్యాప్తు  అంశాలు  లీక్ కావడం  సరికాదన్నారు.సీబీఐ అధికారికి  చెప్పిన విషయాలు ఎలా లీక్ అవుతున్నాయో గమనించాల్సిన అవసరం ఉందన్నారు.వివేకా హత్య  కేసులో   అంశాలను  వక్రీకరించడం సరికాదని ఆయన  అబిప్రాయపడ్డారు.  సీబీఐకి తాను  చెప్పిన అంశాలను  మీడియాలో వక్రీకరించి  రాశారన్నారు. 
సీబీఐ  అధికారులు  అడగని దాన్ని  మీడియాలో  రాయడం  సరికాదన్నారు.తాను సీబీఐకి ఇచ్చిన  సమాచారం రహస్యంగా  ఉంచాలన్నారు.

Latest Videos

undefined

చిటా్ చాట్ అని  చెప్పి సీబీఐ అధికారులు  తన  నుండి  కొన్ని వివరాలు తీసుకున్న విషయం  కరెక్టేనని  ఆయన  చెప్పారు.  తాను చెప్పిన వివరాలతో సీబీఐ రూపోందించిన 161 స్టేట్ మెంట్  కు ఎలాంటి విలువ లేదన్నారు. సాక్ష్యాధారంగా 161 స్టేట్ మెంట్ కు విలువ ఉండదని  ఆయన  అభిప్రాయపడ్డారు.  కేవలం సమాచారంగా మాత్రమే ఆ వివరాలు సీబీఐ సేకరించిందని అజయ్ కల్లాం  గుర్తు  చేశారు.

వైసీపీ  మేనిఫెస్టో సమావేశంలో ఉండగా వివేకా నోమోర్ అనే విషయం మాత్రమే తనకు  తెలిసిందని ఆయన  చెప్పారు. వైఎస్ వివేకానందరెడ్డి  ఎలా  చనిపోయారనే విషయాన్ని తాను  చెప్పలేదన్నారు. సీబీఐ లీక్ లు ఇవ్వటం సరికాదని  ఆయన  అభిప్రాయపడ్డారు. 

click me!