పెరట్లోని చెట్టునుండి పనసపండు మీదపడి... మాజీ కౌన్సిలర్ మృతి

By Arun Kumar PFirst Published Jul 4, 2021, 9:17 AM IST
Highlights

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో శనివారం సాయంత్రం విషాద సంఘటన చోటుచేసుకుంది. 

పాలకొల్లు: ఇంటి పెరట్లోని చెట్టుకు కాసిన పనస పండు కోస్తుండగా అదికాస్తా మీదపడి మాజీ కౌన్సిలర్ మృతి చెందాడు. ఈ విషాద సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... పాలకొల్లు పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో నివాసముంటున్నారు చెందిన మాజీ కౌన్సిలర్ మాటూరి నారాయణమూర్తి(66). గతంలో వ్యాపారవేత్తగా కూడా కొనసాగిన ఆయన కాస్త వయసు మీదపడటంతో ఇంట్లోనే వుండేవాడు. ఈ క్రమంలో ఇంటి పెరట్లో పండ్లమొక్కలను పెంచి వాటి సంరక్షణ చూసుకుంటున్నాడు.  

అమలాపురంలో ఇద్దరు మహిళల మీద కత్తితో దుండగుడు దాడి.. !(వీడియో)

అయితే పెరట్లో పెంచిన పనసచెట్టుకు కాయలు కాశాయి. వాటిని కోయడానికి ప్రయత్నించి నారాయణమూర్తి ప్రమాదానికి గురయ్యారు. వేరే వ్యక్తితో పనసకాయ కోయిస్తూ అది కిందపడకుండా నారాయణమూర్తి ఓ గోనె సంచి పట్టుకుని కింద నిల్చున్నాడు. అయితే బాగా బరువుండే కాయ చెట్టునుండి తెగి సంచిలో కాకుండా నారాయణమూర్తిపై పడింది. దీంతో అతడి తల నేలకు కొట్టుకోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. 

కుటుంబసభ్యులు తీవ్రంగా గాయపడిన మూర్తిని స్థానికంగా వుండే ఓ ప్రైవేట్ హాస్పటల్ కు తరలించారు. పరిస్థితి విషమంగా వుండటంతో మరింత మెరుగైన వైద్యం కోసం భీమవరం తరలిస్తుండగా మార్గమద్యలో ప్రాణాలు వదిలాడు. దీంతో నారాయణ మూర్తి భార్య, ఇద్దరు పిల్లలు బోరున విలపించారు.  
 

click me!