చెల్లెలిపై అత్యాచారం చేసిన అన్న: అమ్మాయికి ఐదు నెలల గర్భం

Published : Jul 04, 2021, 07:16 AM IST
చెల్లెలిపై అత్యాచారం చేసిన అన్న: అమ్మాయికి ఐదు నెలల గర్భం

సారాంశం

ఓ మైనర్ బాలుడు తన చెల్లెలిపై అత్యాచారం చేశాడు. దాంతో ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

తిరుపతి: ఓ బాలుడు వావివరుసలు మరిచి, వరుసకు చెల్లెలు అయిన బాలికపై అత్యాచారం చేశాడు. బాలికను బెదిరించి అతను ఆమెపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ సంఘటన తిరుపతిలో శనివారం రాత్రి వెలుగు చూసింది. ఇద్దరు కూడా మైనర్లే. వారిద్దరు ఒకే తండ్రికి అక్కాచెల్లెళ్లకు పుట్టిన పిల్లలు. 

తిరుపతికి చెందిన ఓ వ్యక్తి చంద్రగిరి మండలానికి ెచందిన మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమె ద్వారా ఓ కుమారుడు పుట్టాడు. అయితే, కొన్నాళ్లకే ఆమె భర్త నుంచి విడిపోయింది. మరొకరిని వివాహం చేసుకుని కుమారుడితో పాటు వడమాలపేటలో నివాసం ఉంటోంది. 

మొదటి భార్యతో విడిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఆమె చెల్లెలిని పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు కూతుళ్లు పుట్టారు. రెండో కూతురికి 14 ఏళ్లు. మొదటి భార్య కుమారుడు (16) తరుచుగా తిరుపతిలోని తన తండ్రి, చిన్నమ్మ ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో ఐదు నెలల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన 14 ఏళ్ల చెల్లెను బెదిరించి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత మళ్లీ కొన్నాళ్లకు అత్యాచరాం చేశాడు. 

అతని బెదిరింపులకు భయపడిన బాలిక ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. బాలుడు అత్యాచారం చేయడంతో బాలిక గర్భం దాల్చింది. ఆమె శరీరంలో ఏర్పడుతున్న మార్పులను గమనించి తల్లి ప్రశ్నించింది.  దాంతో బాలిక అసలు విషయం చెప్పింది. దాంతో తల్లి చైల్డ్ కేర్ ప్రతినిధులకు విషయాన్ని చెప్పింది. వారు అలిపిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

మహిళా రిజర్వేషన్ బిల్లు పై Pamula Pushpa Srivani Reaction | Women Reservation | Asianet News Telugu
పవన్‌ కళ్యాణ్‌.. 30వేల మంది మహిళలు ఏమయ్యారు? Vidadala Rajini Comments| Asianet News Telugu