
కర్నూలు జిల్లా ఆలూరు మాజీ ఎమ్మెల్యే పాటిల్ నీరజారెడ్డి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆమె ప్రయాణిస్తున్న కారు గద్వాల జిల్లా బీచుపల్లి దగ్గర టైర్ పేలి పల్టీ కొట్టింది . ఈ ప్రమాదంలో నీరజారెడ్డి తీవ్రంగా గాయపడటంతో ఆమెను కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నీరజారెడ్డి తుదిశ్వాస విడిచినట్లు ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
1996లో హత్యకు గురైన నీరజా రెడ్డి భర్త దారుణహత్యకు గురయ్యారు. దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో నీరజా రెడ్డి రాజకీయాల్లో వచ్చారు. ఈ క్రమంలో 2004లో కర్నూలు జిల్లా పత్తికొండ నుంచి కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు నీరజా రెడ్డి. అనంతరం 2009లో కాంగ్రెస్ టికెట్‌పై ఆలూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆమె విజయం సాధించారు. అనంతర కాలంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన నీరజా రెడ్డి ప్రస్తుతం ఆలూరు బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్నారు.