ఏపీఈఎస్ఐ స్కాం: పితాని మాజీ పీఏ మురళీమోహన్‌పై సస్పెన్షన్ వేటు

By narsimha lodeFirst Published Aug 7, 2020, 2:20 PM IST
Highlights

: ఏపీ ఈఎస్ఐ స్కాంలో అరెస్టైన మున్సిపల్ ఉద్యోగి మురళీమోహన్ ను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నాడు సస్నెండ్ చేసింది.


అమరావతి: ఏపీ ఈఎస్ఐ స్కాంలో అరెస్టైన మున్సిపల్ ఉద్యోగి మురళీమోహన్ ను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నాడు సస్నెండ్ చేసింది.

చంద్రబాబునాయుడు కేబినెట్  లో పితాని సత్యనారాయణ కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ సమయంలో మురళీమోహన్ పితాని వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు.

ఈ కేసులో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తనయుడు సురేష్ పాత్ర ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. సురేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. ఆయన కోసం ఏసీబీ అధికారులు గాలిస్తున్నారు.

also read:ఈఎస్ఐ స్కామ్: బెయిల్ పిటిషన్ పై అచ్చెన్నాయుడికి హైకోర్టు షాక్

మరో వైపు ఈ కేసులో ఈ ఏడాది జూలై 10వ తేదీన  సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న మురళీ మోహన్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడంతో ఆయనపై ప్రభుత్వం సస్పెన్షన్  వేటు వేసింది. అరెస్టైన రోజు నుండి సస్పెన్షన్ వర్తించనున్నట్టుగా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీ సచివాలయంలోని పట్టణాభివృద్ధి శాఖలో మురళీమోహన్ సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. 

ఈ కేసులో ఇప్పటికే మంత్రి అచ్చెన్నాయుడు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన జ్యూడీషీయల్ రిమాండ్ లో ఉన్నాడు. అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో అచ్చెన్నాయుడు గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
 

click me!