ఏసీబీ కస్టడీకి అచ్చెన్నాయుడు: ఆస్పత్రిలోనే విచారణ

Siva Kodati |  
Published : Jun 24, 2020, 08:34 PM ISTUpdated : Jun 24, 2020, 08:46 PM IST
ఏసీబీ కస్టడీకి అచ్చెన్నాయుడు: ఆస్పత్రిలోనే విచారణ

సారాంశం

ఈఎస్ఐ కుంభకోణంలో నిందితులుగా ఉన్న టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సహా మరో ఐదుగురిని ఏసీబీ కస్టడీకి ఇచ్చేందుకు న్యాయస్థానం అనుమతించింది. 

ఈఎస్ఐ కుంభకోణంలో నిందితులుగా ఉన్న టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సహా మరో ఐదుగురిని ఏసీబీ కస్టడీకి ఇచ్చేందుకు న్యాయస్థానం అనుమతించింది. ఇదే సమయంలో అచ్చెన్నాయుడు ఆరోగ్యం సరిగా లేదని ఆయన తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

పైల్స్ ఆపరేషన్ చేయించుకోవడంతో ప్రస్తుతం అచ్చెన్నాయుడు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. దీనిని పరిగణనలోనికి తీసుకున్న న్యాయస్థానం అచ్చెన్నాయుడిని ఆసుపత్రిలోనే విచారించాలని ఆదేశించింది.

Also Read:చంద్రబాబు విలవిల: కేసుల చిక్కుల్లో కొమ్ములు తిరిగిన నేతలు

మిగిలిన నలుగురిని మాత్రం మూడు రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ హయాంలో ఈఎస్ఐ మందుల కొనుగోళ్లకు సంబంధించిన ఆరోపణలపై ఇటీవల మంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

చంద్రబాబు హయాంలో అచ్చెన్నాయుడు కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు. ఈఎస్‌ఐ ఆసుపత్రులకు సంబంధించి మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైసీపీ ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్‌‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తునకు ఆదేశించింది.

Also Read:సిఐడి నుంచి ఈడీ వివరాలు... అచ్చెన్నాయుడు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

ఈఎస్ఐలో అవినీతి జరిగినట్లు విజిలెన్స్ దర్యాప్తులో తేలింది. నకిలీ కొటేషన్లతో ఆర్డర్లు ఇచ్చినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. నకిలీ కొటేషన్లతో ఆర్డర్లు ఇచ్చినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan Visits Nanded Gurudwara: నాందేడ్ గురుద్వారా సందర్శించిన పవన్ కళ్యాణ్| Asianet Telugu
Arasavalli Rathasapthami: అరసవల్లిలో 80 ఫీట్ రోడ్డులో మెగా సూర్యనమస్కారాలు | Asianet News Telugu