వీనస్ ఆక్వా ఫుడ్స్ ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

By Siva KodatiFirst Published Oct 21, 2020, 9:28 PM IST
Highlights

వీనస్‌ ఆక్వా ఫుడ్స్‌ లిమిటెడ్‌ డైరెక్టర్లు నిమ్మగడ్డ రామకృష్ణ, నిమ్మగడ్డ వేణుగోపాల్‌, వీవీఎస్‌కే విశ్వనాథ్‌ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్‌ చేసింది. హైదరాబాద్‌, విజయవాడలలో రూ 33.39 కోట్ల విలువైన (మార్కెట్‌ విలువ) ఆస్తులను ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది

వీనస్‌ ఆక్వా ఫుడ్స్‌ లిమిటెడ్‌ డైరెక్టర్లు నిమ్మగడ్డ రామకృష్ణ, నిమ్మగడ్డ వేణుగోపాల్‌, వీవీఎస్‌కే విశ్వనాథ్‌ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్‌ చేసింది. హైదరాబాద్‌, విజయవాడలలో రూ 33.39 కోట్ల విలువైన (మార్కెట్‌ విలువ) ఆస్తులను ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది.

వీరు గుడివాడలోని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి రూ.19.44 కోట్ల రుణం తీసుకుని మోసం చేశారని అభియోగాలు మోపింది. చేపల చెరువుల కోసమని రుణం తీసుకుని ఆ నిధులను ఇతర వ్యాపారాలకు మళ్లించినట్టు తమ దర్యాప్తులో వెల్లడైందని ఈడీ పేర్కొంది. 

రుణాలను దారిమళ్లించడం, రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో మొత్తం రూ 36.97 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది. నిందితులు బ్యాంకు రుణంతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల నుంచి చేపల చెరువు పేరుతో రూ 22.64 కోట్ల రుణాలు తీసుకున్నారని తెలిపింది.

రుణాల్లో కొంతమొత్తాన్ని నిమ్మగడ్డ రామకృష్ణ, నిమ్మగడ్డ వేణుగోపాల్‌, వీవీఎన్‌కే విశ్వనాథ్‌లు తమ పేరిట, తమ కుటుంబ సభ్యుల పేరిట స్ధిరాస్తులను కొనుగోలు చేసేందుకు వాడుకున్నారు.

మరోవైపు రూ 1.72 కోట్లను ‘ ఆకాశమే హద్దు ’ అనే సినిమా నిర్మాణానికి మళ్లించారని ఈడీ గుర్తించింది. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా మనీల్యాండరింగ్‌ నిబంధనల కింద ఈడీ వీనస్‌ ఆక్వా ఫుడ్స్‌ అక్రమాలపై దర్యాప్తు చేపట్టింది.

click me!