ఏలూరు వింత వ్యాధి: 606కు పెరిగిన రోగులు, కారణంపై ట్విస్ట్

By telugu teamFirst Published Dec 11, 2020, 7:53 AM IST
Highlights

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వ్యాపిస్తున్న వింత వ్యాధికి లెడ్, నికెల్ కారణం కాదని తాజాగా నిపుణులు ఓ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. డైక్లోరో మిథేన్ ప్రమాదకరమైన స్థాయిలో ఉండడమే కారణం కావచ్చునని భావిస్తున్నారు.

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మరో 16కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం మాయరోగానికి గురైన వారి ంఖ్య 606కు పెరిగింది. ఇప్పటి వరకు 539 మంది చికిత్స పొంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అ్యయారు. సీసం, నికెల్ వంటి భార లోహాలు వ్యాధికి కారణం కావచ్చునని కొద్ది రోజులుగా భావిస్తూ వస్తున్నారు. అయితే, మాయరోగానికి అవి కారణం కాదని తాజాగా అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. 

డైక్లోరో మిథేన్ (డీసీఎం) ఏలూరు వింత వ్యాధికి కారణం కావచ్చునని తాజాగా అంచనా వేస్తున్నారు. ఏలూరులోని 20 ప్రాంతాల నుంచి నీటి నమూనాలను సేకరించిన అధికారులు వాటిని హైదరాబాదులోని ఓ ల్యాబ్ కు పంపించారు. ప్రజలు తాగుతున్న నీటిలో డైక్లోరో మిథేన్ అధిక సంఖ్యలో ఉన్నట్లు పరీక్షల్లో తేలినట్లు చెబుతున్నారు. సాధారణంగా డైక్లోరే మిథేన్ నీటిలో 5 మైక్రో గ్రాముల వరకు ఉండవచ్చు.

అయితే, డైక్లోరో మిథేన్ రసాయనం నీటిలో ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. పత్తేబాద అనే ప్రాంతంలో సేకరించిన నీటి నమూనాల్లో డైక్లోరో మిథేే 960 మైక్రో గ్రాముల వరకు ఉన్నట్లు గుర్తించారని సమాచారం. అశోక్ నగర్ ప్రాంతంలోని నీటీలో 618 గ్రాముల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని ప్రమాదకరమైన కర్బన సమ్మేళనంగా వైద్యులు చెబుతున్నారు. 

నీటిలో సీసం, నికెల్ వంటి భార లోహాలు లేవని ల్యాబ్ పరీక్షల్లో తేలినట్లు తెలుస్తోంది. ప్రమాదకరం కాని ఇతర అవశేషాలు కనిపించినట్లు వారు అంచనాకు వచ్చారు. శుక్రవారం మధ్యాహ్నానికి జాతీయ సంస్థల నివేదికలు రానున్నాయి. కమిటీలో అన్ని కేంద్ర సంస్థల నిపుణులు, జీఎంహెచ్ఓ, డీసీహెచ్ఎస్, వైద్య నిపుణులు కలిపి మొత్తం పది మంది సభ్యులుంటారు. ఆ కమిటీ నివేదికలను క్రోడీకరించి ఓ నిర్ధారణకు వస్తారని అంటున్నారు.

నీటిలో ప్రమాదకర స్థాయిలో ఉందని భావిస్తున్న డైక్లోరో మిథేన్ (డీసీఎం)ను మిథైల్ క్లోరైడ్ అని కూడా పిలుస్తారు. దీన్ని పెయింట్ ను తొలగించడానికి వాడుతారు. హెయిర్ స్ప్రే, కోటింగ్స్, రూమ్ డియోడరెంట్స్ ల తయారీలో డీసీఎంను వాడుతారు. కొన్ని రకాల స్టెరాయిడ్స్, టాబ్లెట్ కోటింగ్ కు కూడా వాడుతారు. పరిమితికి మించి దాన్ని వాడితే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇది ప్రత్యక్షంగా నాడీ మండలంపై ప్రభావం చూపుతుంది. 

click me!