కోర్టు ధిక్కారణ : ఏలూరు డీఎఫ్ వోకు రెండు నెలల జైలు, జరిమానా..

By AN Telugu  |  First Published Aug 13, 2021, 11:28 AM IST

పశ్చిమగోదావరి జిల్లా కన్నాపురం ఫారెస్ట్ రేంజి పరిధిలో టేకు, కలప రవాణా నిమిత్తం టెండర్లను ఆహ్వానిస్తూ అటవీ శాఖ ఈ ఏడాది జనవరి 12న నోటిఫికేషన్ జారీ చేసింది. దాఖలైన టెండర్లలో ఏలూరుకు చెందిన గోలి శరత్ రెడ్డి అనే వ్యక్తి లోయెస్ట్ గా నిలిచారు. అధికారులు అతనికి వర్క్ ఆర్డర్ ఇవ్వకుండా... వన సంరక్షణ సమితి ప్రతినిధులతో పనులు మొదలుపెట్టారు.


అమరావతి : కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు అటవీశాఖ అధికారి (డీఎఫ్‌వో) యశోద బాయికి కోర్టు ధిక్కార నేరం కింద హైకోర్టు రెండు నెలల జైలు శిక్ష, రెండు వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే మరో వారం పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

యశోదాబాయి అభ్యర్థన మేరకు ఈ తీర్పు అమలును 4 వారాల పాటు నిలుపుదల చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ రెండు రోజుల క్రితం తీర్పును వెలువరించారు. టెండర్ పిలిచి... వర్క్ ఆర్డర్ ఇవ్వకపోవడంతో ఈ శిక్ష విధించినట్టు తెలుస్తుంది. 

Latest Videos

పశ్చిమగోదావరి జిల్లా కన్నాపురం ఫారెస్ట్ రేంజి పరిధిలో టేకు, కలప రవాణా నిమిత్తం టెండర్లను ఆహ్వానిస్తూ అటవీ శాఖ ఈ ఏడాది జనవరి 12న నోటిఫికేషన్ జారీ చేసింది. దాఖలైన టెండర్లలో ఏలూరుకు చెందిన గోలి శరత్ రెడ్డి అనే వ్యక్తి లోయెస్ట్ గా నిలిచారు. అధికారులు అతనికి వర్క్ ఆర్డర్ ఇవ్వకుండా... వన సంరక్షణ సమితి ప్రతినిధులతో పనులు మొదలుపెట్టారు.

దీనిపై శరత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  దానిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ టెండర్ ప్రక్రియను పూర్తి చేసేంతవరకు ఇలాంటి పనులు కొనసాగించ వద్దని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.

వాటిని బేఖాతరు చేస్తూ పనులు కొనసాగిస్తున్నారంటూ  జిల్లా అటవీ శాఖ అధికారులు టి. శ్రీనివాసరావు, యశోదాబాయిలపై శరత్ రెడ్డి కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు.  దీనిపై విచారణ జరిపిన జస్టిస్ దేవానంద్ టెండర్లను రద్దు చేయకుండా వన సంరక్షణ సమితి చేత  టేకు, కలప రవాణా పనులు చేయించడాన్ని తప్పు పట్టారు.

 వన సంరక్షణ సమితి చేత పనులు చేయించడం వెనక ప్రదేశమే ఉంటే,   కోర్టుమధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి ముం ముందే టెండర్లు రద్దు చేసి ఆ తర్వాత కొనసాగించి ఉండేవారని తెలిపారు. అధికారం నుంచి తప్పించుకునేందుకే యశోద భాయ్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వెలువడిన రోజునే టెండర్లు రద్దు చేశారని తెలిపారు. యశోద బాయి చెబుతున్న మాటలు, బేషరతు క్షమాపణ వెనక సదుద్దేశం లేదని, అందువల్ల ఆ క్షమాపణను తిరస్కరిస్తున్నట్టు న్యాయమూర్తి జస్టిస్‌ దేవానంద్‌ పేర్కొంటూ పై తీర్పునిచ్చారు. 
 

click me!