ప్రజాస్వామ్య దేశంలో భౌతిక దాడులు, హత్యాయత్నాల ద్వారా భయపెట్టాలనుకోవడం సరికాదని అన్నారు. ప్రజాసమస్యలపై నిరంతరం అధికారులను, అధికార పక్షాన్ని ప్రశ్నిస్తున్న మేడం రమేష్ పై, వ్యక్తిగతంగా కక్షగట్టి దాడులతో బయపెట్టాలి అనుకోవటం అవివేకమైన చర్యగా సోము వీర్రాజు అభివర్ణించారు.
గుంటూరు జిల్లా వినుకొండ పట్టణ బిజెపి అధ్యక్షుడు మేడం రమేష్ పై శుక్రవారం ఉదయం మార్నింగ్ వాక్ కు వెళ్ళిన సమయంలో కొందరు కర్రలతో దాడి చేయడాన్ని ఏపీ బిజెపి అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు తీవ్రంగా ఖండించారు.
ప్రజాస్వామ్య దేశంలో భౌతిక దాడులు, హత్యాయత్నాల ద్వారా భయపెట్టాలనుకోవడం సరికాదని అన్నారు. ప్రజాసమస్యలపై నిరంతరం అధికారులను, అధికార పక్షాన్ని ప్రశ్నిస్తున్న మేడం రమేష్ పై, వ్యక్తిగతంగా కక్షగట్టి దాడులతో బయపెట్టాలి అనుకోవటం అవివేకమైన చర్యగా సోము వీర్రాజు అభివర్ణించారు.
undefined
ఈ ఘటనమీద నరసరావుపేట పార్లమెంటు జిల్లా అధ్యక్షుడుని సత్వరమే వినుకొండ వెళ్లి, సమగ్ర సమాచారం సేకరించాలని, రమేష్ కు అవసరమైన మెరుగైన వైద్య సేవలు అందించాలని సోము వీర్రాజు ఆదేశించారు.
రాష్ట్రంలో పార్టీ శ్రేణులను రక్షించుకునేందుకు అవసరమైతే తానే స్వయంగా రంగంలోకి దిగుతానని, జిల్లా యస్పీ ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని కోరారు.