జగన్ కి షాక్... గవర్నర్ ని కలిసిన ఎస్ఈసీ

By telugu news teamFirst Published Mar 16, 2020, 10:43 AM IST
Highlights

ఏ పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో గర్నవర్ కి వివరించినట్లు సమాచారం. ఎస్ఈసీ నిర్ణయంపై ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే గవర్నర్ కి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం లేవనెత్తిన అభ్యంతరాలపై ఎస్ఈసీతో గవర్నర్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి ఊహించని షాక్ తగిలింది. సార్వత్రిక ఎన్నికల వేళ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)  నిమ్మలగడ్డ రమేష్ కుమార్ కి సీఎం జగన్ మధ్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... సోమవారం ఉదయం ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ని కలిశారు.

Also Read జగన్ ప్రభుత్వం ఫైట్: ఈసీ నిమ్మగడ్డకు సీఎస్ నీలం సహానీ లేఖ..

రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాకు గల కారణాలను వివరించారు. ఏ పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో గర్నవర్ కి వివరించినట్లు సమాచారం. ఎస్ఈసీ నిర్ణయంపై ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే గవర్నర్ కి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం లేవనెత్తిన అభ్యంతరాలపై ఎస్ఈసీతో గవర్నర్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

స్థానిక సంస్థల ఎన్నికలను 6 వారాలపాటు వాయిదా వేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదివారం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. కాగా.. మరోవైపు ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పై సీఎం  జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 

click me!