వివాహిత స్నానం చేస్తుండగా వీడియోలు...బ్లాక్ మెయిల్

Published : May 14, 2019, 09:55 AM IST
వివాహిత స్నానం చేస్తుండగా వీడియోలు...బ్లాక్ మెయిల్

సారాంశం

వివాహిత స్నానం చేస్తుండగా... ఫోటోలు, వీడియోలు తీసి.. సోషల్ మీడియాలో పెడతానంటూ ఓ వ్యక్తి బెదిరించాడు. ఆ బెదిరింపులకు బయపడిన వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 


వివాహిత స్నానం చేస్తుండగా... ఫోటోలు, వీడియోలు తీసి.. సోషల్ మీడియాలో పెడతానంటూ ఓ వ్యక్తి బెదిరించాడు. ఆ బెదిరింపులకు బయపడిన వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమె చావు, బతుకుల మధ్య పోరాడుతోంది. ఈ సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... శ్రీకాకుళం జిల్లాకు చెందిన దంపతులు కుటుంబంతో సహా.. పదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం గుంటూరు వచ్చారు. కూలీ పనిచేసుకుంటూ.. భార్య బిడ్డలను పోషిస్తున్నాడు. కాగా... ఇటీవల అతని భార్య స్నానం చేస్తుండగా ఓ యువకుడు ఆమెను ఫోటోలు, వీడియోలు తీశాడు. వాటని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు.

దీంతో పరువు పోతుందని భావించిన మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

MLA Viral Video: ఎమ్మెల్యే రాస‌లీలలు.? ఈ వీడియోలో ఉంది నిజంగానే జ‌న‌సేన నాయ‌కుడా.?
IMD Rain Alert : కేరళ తీరంలో అల్పపీడనం... ఈ ప్రాంతాల్లో వర్షాలు