ఏపీలో ఉపఎన్నికలు... వివరణ ఇచ్చిన ఈసీ

By ramya neerukondaFirst Published Oct 9, 2018, 4:17 PM IST
Highlights

ప్రజా ప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్‌ 151ఏ ప్రకారం పదవీ కాలపరిమితి ఏడాది కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఆరు నెలల్లోగా ఉప ఎన్నికలు నిర్వహించాలని, 16వ లోక్‌సభ కాలపరిమితి 2019 జూన్‌ 3వరకూ మాత్రమే ఉందని ఈసీ వెల్లడించింది.

ఏపీలో ఉప ఎన్నికలపై ఎన్నికల కమిషన్ వివరణ ఇచ్చింది. ఇటీవల రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహించకపోవడంపై మీడియాలో పలువిథాలుగా కథనాలు వచ్చాయి. కాగా.. దీనిపై ఈసీ వివరణ ఇచ్చింది.

కర్నాటకలోని బళ్లారి, షిమోగ, మాండ్య లోక్‌సభ స్ధానాలు మే 18, మే 21 తేదీల నాటికే ఖాళీ అయ్యాయని, ఆంధ్రప్రదేశ్‌లోని 5 లోక్‌సభ స్ధానాలు జూన్‌ 20న ఖాళీ అయ్యాయని తెలిపింది. ప్రజా ప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్‌ 151ఏ ప్రకారం పదవీ కాలపరిమితి ఏడాది కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఆరు నెలల్లోగా ఉప ఎన్నికలు నిర్వహించాలని, 16వ లోక్‌సభ కాలపరిమితి 2019 జూన్‌ 3వరకూ మాత్రమే ఉందని ఈసీ వెల్లడించింది.

కర్నాటకలో ఏర్పడిన ఖాళీలు అంతకంటే ముందే ఏర్పడినందున అక్కడ ఉప ఎన్నికల నిర్వహణ అనివార్యమైందని ఈసీ వివరణ ఇచ్చింది.  ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ స్ధానాల ఖాళీ జూన్‌ 20న నెలకొన్నందున సభ్యుల పదవీకాలం ఏడాదిలోపు ఉండనుండటంతో ఏపీలో ఉప ఎన్నికల నిర్వహణ అవసరం లేకపోయిందని పేర్కొంది. 

click me!