ఢిల్లీ వేదికగా మరోపోరాటనికి ఏపీ టీడీపీ ఎంపీలు

By Nagaraju TFirst Published Oct 9, 2018, 4:14 PM IST
Highlights

 కేంద్ర ప్రభుత్వంపై మరోపోరాటానికి సన్నద్ధమవుతున్నారు ఏపీ టీడీపీ ఎంపీలు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదాపై తమ నిరసన గళం విప్పిన ఎంపీలు ఈసారి పోరాటానికి రెడీ అవుతున్నారు. విభజన చట్టంలోని హామీల అమలుకు కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.

అమరావతి: కేంద్ర ప్రభుత్వంపై మరోపోరాటానికి సన్నద్ధమవుతున్నారు ఏపీ టీడీపీ ఎంపీలు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదాపై తమ నిరసన గళం విప్పిన ఎంపీలు ఈసారి పోరాటానికి రెడీ అవుతున్నారు. విభజన చట్టంలోని హామీల అమలుకు కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈనెల 12 నుంచి టీడీపీ ఎంపీలు నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు కార్యచరణ రూపొందించారు. 

ముఖ్యంగా విభజన చట్టంలో పెండింగ్ లో ఉన్న 18 అంశాలపై ఆయా శాఖల మంత్రులను నిలదీసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముందుగా కడప స్టీల్ ప్లాంట్ కు సంబంధించి పనులు ఎంతవరకు వచ్చాయి అన్న అంశంపై ఈనెల 12న కేంద్ర ఉక్కుకర్మాగార శాఖ మంత్రి చౌదరి వీరేందర్ సింగ్ నివాసం వద్ద నిరసన తెలపాలని నిర్ణయించారు. ఉక్కు కర్మాగారంపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలపాలని నిలదీయనున్నారు. 

ఆ తర్వాత మిగిలిన 17  అంశాలకు సంబంధించి ఆయా శాఖల మంత్రుల నివాసాలు లేదా కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. మరోవైపు వెనుకబడిన జిల్లాలకు సంబంధించి నిధుల విడులలో జాప్యంపై కూడా గట్టిగా నిరసన తెలపాలని టీడీపీ ఎంపీలు నిర్ణయించుకున్నారు.  

click me!