
వైసీపీ,బీజేపీ నేతలపై టీడీపీ ఎంపీ కనకమేడల సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాని నరేంద్రమోదీ కనుసన్నల్లోనే పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. బీజేపీతో కుమ్మక్కై వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారని ఆరోపించారు. ఎన్నికలు రాకుండా ఒప్పందం చేసుకుని రాజీనామాలు ఆమోదింపచేసుకున్నారని అన్నారు.
ఏడాది లోపు రాజీనామాలు చేస్తే ఎన్నికలు రావనే.. అప్పటి దాకా ఆగారని విమర్శించారు. మోదీకి వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తోందనే వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారని కనకమేడల ఆరోపించారు. ఎన్నికల తర్వాత దేశం వదిలి పారిపోయే ఆలోచనలో వైసీపీ నేతలు ఉన్నారని వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డిపై 11 కేసులున్నాయని, చంద్రబాబుపై ఒక్క కేసు కూడా లేదన్నారు. జగన్ రూ.43వేల కోట్లు దోచుకోవడానికి ప్రధాన సూత్రధారి విజయసాయిరెడ్డి అని పేర్కొన్నారు