పోటెత్తిన కృష్ణమ్మ: శ్రీశైలం ప్రాజెక్టు 8 గేట్ల ఎత్తివేత (వీడియో)

By narsimha lodeFirst Published Aug 23, 2018, 6:48 PM IST
Highlights

శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తింది. వరద నీరు పోటెత్తడంతో ప్రాజెక్టు 8 గేట్లను గురువారం నాడు ఎత్తారు. శ్రీశైలం ప్రాజెక్టు  గేట్లను ఎత్తి నాగార్జునసాగర్ కు నీటిని వదిలేస్తున్నారు.

కర్నూల్:శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తింది. వరద నీరు పోటెత్తడంతో ప్రాజెక్టు 8 గేట్లను గురువారం నాడు ఎత్తారు. శ్రీశైలం ప్రాజెక్టు  గేట్లను ఎత్తి నాగార్జునసాగర్ కు నీటిని వదిలేస్తున్నారు.

గురువారం సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టుకు 2,94,239 క్యూసెక్కుల నీరు వస్తోంది. అయితే 3,19,948 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశం ప్రస్తుత నీటిమట్టం 883.30 అడుగులు.  పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు.

"

 ప్రస్తుత నీటి నిల్వ 206.09 టీఎంసీలు.  పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు. కృష్ణా నదిలో ఆల్మట్టికి, తుంగభద్రకు వరద పోటెత్తుతోంది. దీంతో శ్రీశైలానికి భారీగా వరద వస్తోంది. 

ఈ వరద ఇలానే కొనసాగితే  నాగార్జున సాగర్‌కు కూడ నీరొచ్చే అవకాశం ఉంది. అయితే సాగర్‌ పూర్తిస్థాయిలో నిండాలంటే ఇంకా వంద టీఎంసీల నీరు అవసరం ఉంది.
శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ప్రాజెక్టును చూసేందుకు  పెద్ద ఎత్తున వస్తున్నారు.  దీంతో శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలోని రహదారి వాహానాలతో రద్దీగా నిండిపోయింది.


"

click me!