విద్యార్థిగా ఉన్నప్పుడే ఎమ్మెల్యే కావాలనుకున్నా....చంద్రబాబు

By sivanagaprasad KodatiFirst Published Aug 23, 2018, 6:23 PM IST
Highlights

తాను విద్యార్థిగా ఉన్నప్పుడే ఎమ్మెల్యే కావాలని సంకల్పించుకున్నానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మనసులో మాట తెలిపారు. ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన జ్ఞానభేరి కార్యక్రమంలో చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జీవితంలో అన్నింటి కంటే విద్యార్థి దశ కీలకమని గుర్తు చేశారు. 

విశాఖపట్టణం: తాను విద్యార్థిగా ఉన్నప్పుడే ఎమ్మెల్యే కావాలని సంకల్పించుకున్నానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మనసులో మాట తెలిపారు. ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన జ్ఞానభేరి కార్యక్రమంలో చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జీవితంలో అన్నింటి కంటే విద్యార్థి దశ కీలకమని గుర్తు చేశారు. 

విద్యార్థి దశలోనే లక్ష్యాలు నిర్దేశించుకుని సాధించాలి.  బిల్‌గేట్స్‌కు నా విజన్‌ వివరించి మైక్రోసాఫ్ట్‌ ను హైదరాబాద్‌కు వచ్చేలా కృషి చేశానని గుర్తు చేశారు. అలాగే విద్యార్థులు కూడా  మీ లక్ష్యాలను చేరుకోవడానికి అవకాశాలు అందిపుచ్చుకోవాలని సూచించారు. ఫలితాలు వచ్చే వరకు కష్టపడాలి అప్పుడే నాయకత్వం సాఫల్యం అవుతుందంటూ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, వైద్య కళాశాలలను గణనీయంగా పెంచామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఐటీ అసలు లేని స్థాయి నుంచి 17శాతానికి తీసుకురాగలిగాం అన్నారు. యువత ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చేస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఇన్నోవేషన్ వ్యాలీ అంటే ఆంధ్రప్రదేశ్ అని ప్రపంచం గుర్తించేలా చేస్తానని హామీ ఇచ్చారు. 

ఎల్‌ఈడీ దీపాల వినియోగం వల్ల ప్రభుత్వానికి 40వేల కోట్ల రూపాయలు ఆదా అవుతుందన్నారు. రాష్ట్ర బడ్జెట్ లోటులో ఉన్నా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 25వేల కిలోమీటర్ల మేర సిమెంటు రోడ్లు వేశామన్నారు. చెత్త నుంచి సంపద సృష్టించి పంచాయితీకి నిధులు రాబట్టేలా చేస్తున్నట్లు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ఎక్కడా సహాయపడటం లేదు. ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని స్పష్టం చేశారు. కేంద్రం సహకరించకపోయినా రాష్ట్రాభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీపడేది లేదని చంద్రబాబు హామీ ఇచ్చారు.  

click me!