లైగర్ సినిమాలో పెట్టుబడులు.. ప్రొద్దుటూరు ఫైనాన్షియర్‌ను ప్రశ్నిస్తోన్న ఈడీ

By Siva KodatiFirst Published Dec 16, 2022, 8:21 PM IST
Highlights

లైగర్ సినిమాలో పెట్టుబడులకు సంబంధించి కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఫైనాన్షియర్ శోభన్‌ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు . ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత ఛార్మీ, హీరో విజయ్ దేవరకొండను ఈడీ అధికారులు విచారించారు. 

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమాలో పెట్టుబడులపై ఈడీ అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పలువురు రాజకీయ ప్రముఖులు పెట్టుబడులు పెట్టారని ఈడీ అనుమానిస్తోంది. ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత ఛార్మీ, హీరో విజయ్ దేవరకొండను ఈడీ అధికారులు ప్రశ్నించారు. తాజాగా కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఫైనాన్షియర్ శోభన్‌ను ప్రశ్నిస్తున్నారు . 

ఇకపోతే... `లైగర్‌` చిత్రాన్ని పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించారు. వంద కోట్లకుపైగానే బడ్జెట్‌ అయినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఈ సినిమా ఆగస్ట్ 25న విడుదలై పరాజయం చెందింది. డిజాస్టర్‌గా నిలిచింది. ఆ నష్టాల వ్యవహారానికి సంబంధించిన లావాదేవీలను సైతం ఈడీ విచారిస్తుంది. ఇదిలా ఉంటే విదేశాల నుంచి ఈ సినిమాకి పెట్టుబడులు పెట్టినట్టు ఈడీ గుర్తించిందని సమాచారం. అంతేకాదు పలువురు పొలిటికల్‌ లీడర్స్ కూడా ఇందులో ఇన్వెస్ట్ చేశారట. దానిపై ఎన్‌ఫోర్స్ మెంట్‌ డైరెక్టరేట్‌ విచారించబోతుంది. 

ALso REad:వాళ్లు రమ్మన్నారు.. నేను వెళ్లా, నా జీవితంలో ఇదో అనుభవం : ఈడీ విచారణపై విజయ్ దేవరకొండ

`లైగర్‌`లో విజయ్‌ దేవరకొండ హీరోగా నటించగా, బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా చేసింది. వరల్డ్ మాజీ బాక్సింగ్‌ ఛాంపియన్‌ మైఖేల్‌ టైసన్‌ ఇందులో కీలక పాత్రలో నటించారు. బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 25న తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం విజయ్‌ `ఖుషీ` చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నారు. 

click me!