టీడీపీ ఆఫీసుకు వైసీపీ కార్యకర్తల నిప్పు.. ఇరువర్గాల దాడులు, రణరంగంగా మాచర్ల

Siva Kodati |  
Published : Dec 16, 2022, 07:41 PM ISTUpdated : Dec 16, 2022, 09:16 PM IST
టీడీపీ ఆఫీసుకు వైసీపీ కార్యకర్తల నిప్పు.. ఇరువర్గాల దాడులు, రణరంగంగా మాచర్ల

సారాంశం

పల్నాడు జిల్లా మాచర్లలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ఇదేం ఖర్మ రా బాబు కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. 

పల్నాడు జిల్లా మాచర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. రాళ్లతో ఇరువర్గాలు దాడులు చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. టీడీపీ నిర్వహిస్తోన్న ‘‘ఇదేం ఖర్మ రా బాబు’’ అనే కార్యక్రమంలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. సీపీ నేత, మాజీ మున్సిపల్ ఛైర్మన్ కిశోర్ ప్రాతినిథ్యం వహిస్తున్న వార్డులోనే ఇదేం ఖర్మరా బాబు కార్యక్రమం నిర్వహించాలని టీడీపీ చూసింది. దీంతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు యత్నించాయి. ఈ క్రమంలోనే ఇరు వర్గాలు దాడికి దిగడంతో అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.

ఇదే సమయంలో టీడీపీ నేత బ్రహ్మానందరెడ్డిని పోలీసులు గుంటూరు తరలిస్తుండగా ఆ వాహనాన్ని వైసీపీ కార్యకర్తలు వెంబడించడంతో పాటు తెలుగుదేశం కార్యాలయానికి నిప్పు పెట్టారు. అటు ఇరు పార్టీల కార్యకర్తలు మాచర్లకు చేరుకుంటున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు..ఏపీలో వర్షాలు స్టార్ట్ | Asianet News Telugu
Weather Update : బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు.. మరి వర్షాలు ఎక్కడ? ఎప్పట్నుంచి కురుస్తాయి?