భూమాకు ఈసీ షాక్

Published : Aug 27, 2017, 09:55 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
భూమాకు ఈసీ షాక్

సారాంశం

ఎన్నికల కమీషన్ రూపంలో నంద్యాల టిడిపి అభ్యర్ధి  భూమా బ్రహ్మానందరెడ్డికి షాక్ తగిలేట్లుంది. ఎన్నికల వ్యయానికి సంబంధించిన షాక్ ఇది. ప్రతీ ఎన్నికలోనూ రెండు రకాల ఖర్చులుంటాయి. మొదటిది అభ్యర్ధి పెట్టే ఖర్చు, రెండోది పార్టీ వ్యయం. స్టార్ క్యాంపైనర్ల జాబితాను ప్రతీ పార్టీ నోటిఫికేషన్ జారీ అయినా వారంలోగా ఈసీకి అందచేయాలన్నది నిబంధన.

ఎన్నికల కమీషన్ రూపంలో నంద్యాల టిడిపి అభ్యర్ధి  భూమా బ్రహ్మానందరెడ్డికి షాక్ తగిలేట్లుంది. ఎన్నికల వ్యయానికి సంబంధించిన షాక్ ఇది. ఇంతకీ జరిగిందేంటంటే,  ప్రతీ ఎన్నికలోనూ రెండు రకాల ఖర్చులుంటాయి. మొదటిది అభ్యర్ధి పెట్టే ఖర్చు. రెండోది పార్టీ వ్యయం. ఎంఎల్ఏగా పోటీ చేస్తున్న అభ్యర్ధి రూ. 25 లక్షలకు మించి వ్యయం చేసేందుకు లేదన్న విషయం అందరికీ తెలిసిందే కదా?

ఇక పార్టీ చేసే ఖర్చుకు మాత్రం పరిమితి లేదు. మామూలుగా పార్టీ తరపున ప్రచారం చేసే వాళ్లు సహజంగా పార్టీ అధ్యక్షుడు, ముఖ్య నేతలే అయివుంటారు. ఆ స్టార్ క్యాంపైనర్ల జాబితాను ప్రతీ పార్టీ నోటిఫికేషన్ జారీ అయినా వారంలోగా ఈసీకి అందచేయాలన్నది నిబంధన.

నంద్యాలలో కూడా ఉపఎన్నికలో పార్టీ తరపున స్టార్ క్యాంపైనర్లుగా చంద్రబాబునాయుడు, నందమూరి బాలకృష్ణ ప్రచారంలో పాల్గొన్నారు. అయితే, వారిద్దరి పేర్లను టిడిపి వారంలోగా ఇవ్వాల్సుండగా రెండు వారాల తర్వాత అందచేసింది. అవిషయంపైనే ఈసీ సీరియస్ అయింది. దాంతో నిబంధనలను పాటించటంలో విఫలమైన భూమా బ్రహ్మానందరెడ్డి ఎన్నికల వ్యయం పెరిగిపోనుంది.

పార్టీ చేసిన తప్పిదం వల్ల అభ్యర్ధి ఎన్నికల ఖర్చులోనే స్టార్ క్యాంపైనర్ల ఖర్చును కూడా జమచేయాలని ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. దాంతో భూమా ఎన్నికల వ్యయం రూ. 25 లక్షలు దాటిపోయే అవకాశం ఉందేమోనని టిడిపి వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. సరే, కోట్ల రూపాయలు ఖర్చు చేసినా చూపుతున్నది మాత్రం రూ. 25 లక్షలకు లోపలే అన్న విషయం అందరకీ తెలిసిందే. ఇపుడు భూమా తన ఎన్నికల వ్యయాన్ని ఎంత చూపుతారన్నది ఆసక్తిగా మారింది.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్