గవర్నర్ కోటాలో నలుగురు ఎమ్మెల్సీలు: ఈసీ ఉత్తర్వులు

By narsimha lode  |  First Published Jun 16, 2021, 12:37 PM IST

ఏపీ రాష్ట్రంలో గవర్నర్ కోటాలో నలుగురు ఎమ్మెల్సీల నియామకంపై ఎన్నికల కమిషన్ బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. 


అమరావతి:ఏపీ రాష్ట్రంలో గవర్నర్ కోటాలో నలుగురు ఎమ్మెల్సీల నియామకంపై ఎన్నికల కమిషన్ బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ కోటాలో  నలుగురు ఎమ్మెల్సీల నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం నలుగురి పేర్లను సిఫారసు చేసింది.  ఈ నలుగురి పేర్లకు సంబంధించి ఇద్దరి పేర్లను గవర్నర్  అభ్యంతరం తెలపడంతో ఏపీ సీఎం జగన్ గవర్నర్ తో భేటీ అయ్యారు. 

also read:గవర్నర్ కోటాలో నలుగురు ఎమ్మెల్సీలు: ఆమోదించిన బిశ్వభూషణ్

Latest Videos

చంద్రబాబు ప్రభుత్వ హయంలో కూడ క్రిమినల్ కేసులున్నవారిని ఎమ్మెల్సీలుగా నియమించిన విషయాన్ని ఏపీ సర్కార్ గుర్తు చేసింది. గవర్నర్ తో భేటీ అయిన కొద్ది నిమిషాల్లోనే నలుగురు ఎమ్మెల్సీలను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు.  ఈ నలుగురి పేర్లకు గవర్నర్ ఆమోదం తెలపడంతో  ఎన్నికల కమిషన్ బుధవారం నాడు  ఎమ్మెల్సీల ఉత్తర్వులు విడుదల చేసింది.  తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి, మోషన్ రాజు, రమేష్ యాదవ్ లను ఎమ్మెల్సీలుగా నియమితులైనట్టుగా ఈసీ తెలిపింది. 

గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈ నలుగురికి జగన్  ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారు. 

click me!