''2008 డిఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్... ఎస్జీటీలుగా నియమించేందుకు సీఎం ఆమోదం''

By Arun Kumar PFirst Published Jun 16, 2021, 12:15 PM IST
Highlights

2008 డిఎస్సిలో క్వాలిఫై అయిన 2193 మంది అభ్యర్థులను ఎస్జీటీలుగా నియమించేందుకు సీఎం ఆమోదం తెలిపారని విద్యా మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.  

అమరావతి: డిఎస్సి 2008 ఎగ్జామ్స్ అంశం 13 సంవత్సరాలు గా పెండింగ్ లో ఉందని... ఇవాళ సీఎం జగన్ పెద్ద మనస్సు తో వారికి అండగా నిలిచారని  విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.   2193 మంది అభ్యర్థులను ఎస్జీటీలుగా నియమించేందుకు సీఎం ఆమోదం తెలిపారని... త్వరలోనే అధికారికంగా జీఓ ఇచ్చి వారికి పోస్టింగ్ ఇస్తామన్నారు. ఈ నిర్ణయంతో సంవత్సరానికి సుమారు 50 నుండి 60 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడుతుందని... అయినా సీఎం వెనకడుగు వెయ్యలేదని విద్యామంత్రి పేర్కోన్నారు. 

''2014 ఎన్నికల సమయంలో కూడా మేనిఫెస్టోలో పెట్టి కూడా టీడీపీ డిఎస్సి అభ్యర్థులను మోసం చేసింది. చంద్రబాబు ముసలి కన్నీరు కార్చి, క్యాబినెట్ తీర్మానం చేసి కూడా అమలు చేయలేదు. 1998 డిఎస్సిపై కమిటీలు వేసి మరి చంద్రబాబు మోసం చేశారు. 1998 డిఎస్సీకి సంబంధించి 36 మందిని ఈరోజు మేము గుర్తించాం... వారికి న్యాయం చేస్తాం'' అని సురేష్ భరోసా ఇచ్చారు. 

read more  జూలైలో టెన్త్, ఇంటర్ పరీక్షలు.. జగన్ నిర్ణయమే తరువాయి: స్పష్టతనిచ్చిన మంత్రి ఆదిమూలపు

ఇక ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టింది కాబట్టి జులై మొదటి వారంలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు అవకాశం ఉందని విద్యాశాఖ మంత్రి తెలిపారు.  జులై చివర్లో 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నామని... గురువారం సిఎం జగన్ వద్ద ఈ అంశంపై చర్చిస్తామన్నారు.  

''ఇంటర్ మార్కులకు ఎంసెట్ పరీక్షలకు లింక్ ఉంది. కాబట్టి విద్యార్థులు భవిష్యత్ ను ద్రుష్టిలో వుంచుకుని పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నాం. ఎగ్జామ్స్ రద్దు చేయాలనుకుంటే నిమిషం పట్టదు. కానీ అలాంటి నిర్ణయం తీసుకుంటే విద్యార్థులకే నష్టం. విద్యార్థుల భవిష్యత్, ఆరోగ్యం విషయం లో ప్రభుత్వం చాలా బాధ్యతగా ఉంది'' అని మంత్రి  సురేష్ వెల్లడించారు. 
 

click me!