ఇకపై ఇసుక తవ్వకాలకు ఈ-పర్మిట్... జగన్ సర్కార్ నిర్ణయం

Published : Jun 09, 2021, 10:31 AM IST
ఇకపై ఇసుక తవ్వకాలకు ఈ-పర్మిట్... జగన్ సర్కార్ నిర్ణయం

సారాంశం

ఇసుకకు ఈ పర్మిట్‌ కోసం మైనింగ్ డిపార్ట్‌మెంట్ ద్వారా సాఫ్ట్‌వేర్‌ను సిద్దం చేశామని, దానిని ఇప్పుడు అమలులోకి తీసుకువస్తున్నామని ఏపీ భూగర్భ గనులశాఖ సంచాలకులు (డిఎంజి) విజి వెంకటరెడ్డి  వివరించారు. 

అమరావతి: ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక తవ్వకాలకు ఈ పర్మిట్ తప్పనిసరి చేస్తున్నట్లు... ఇందుకోసం ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్‌ను సిద్దం చేసినట్లు భూగర్భ గనులశాఖ సంచాలకులు (డిఎంజి) విజి వెంకటరెడ్డి తెలిపారు. ప్రైవేటు వ్యక్తులకు ఇసుక తవ్వకాలను అప్పగించే క్రమంలో టెండర్లను దక్కించుకున్న జేపీ పవర్ వెంచర్స్‌తో జరిగిన అగ్రిమెంట్‌లోనే ఈ మేరకు అంగీకారం జరిగిందని వెల్లడించారు. 

ఇసుకకు ఈ పర్మిట్‌ కోసం మైనింగ్ డిపార్ట్‌మెంట్ ద్వారా సాఫ్ట్‌వేర్‌ను సిద్దం చేశామని, దానిని ఇప్పుడు అమలులోకి తీసుకువస్తున్నామని వివరించారు. ఇప్పటి వరకు ఇతర మినరల్స్‌కు అనుమతులు ఇచ్చేందుకు ఈ పర్మిట్ విధానంను అమలు చేస్తున్నామని, ఇకపై ఇసుక తవ్వకాలకు కూడా ఇదే విధానం వర్తింపచేస్తున్నామని తెలిపారు. 

read more  రాష్ట్రమంతా ఇసుకకు ఒకే రేటు,ఎక్కడైనా కొనుగోలు చేయొచ్చు: ఏపీ సర్కార్

రాష్ట్రంలో ఇసుక తవ్వకాలకు అనుమతి ఉన్న జేపీ పవర్ వెంచర్స్‌ సంస్థ ఇకపై రీచ్‌ల వారీగా ఇసుక తవ్వకాలు జరిపేందుకు ఆన్‌లైన్‌లో ఈ పర్మిట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఆయా రీచ్‌ల పరిధిలోని మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి ఎటువంటి జాప్యం లేకుండా డిఎంజి కార్యాలయం నుంచి ఈ పర్మిట్‌ను జారీ చేస్తామని అన్నారు. 

ఈ పర్మిట్ వల్ల ఏ రీచ్‌లో ఎంత ఇసుక తవ్వకానికి సంబంధించి అనుమతులు ఇచ్చాం, ఏ మేరకు మైనింగ్ జరిగిందనేది ఖచ్చితంగా తెలుస్తుందన్నారు. ఆన్‌లైన్‌లో దీనికి సంబంధించిన వివరాలు నమోదవ్వడం వల్ల మరింత పారదర్శకత, జవాబుదారీతనం వస్తుందని వెంకటరెడ్డి అన్నారు.
 

PREV
click me!

Recommended Stories

నన్ను సార్ అంటే చాక్లెట్ ఇవ్వాలి విద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Nara Lokesh Fun With Students
Nara Lokesh Speech: టీడీపీ కార్యకర్తలకు పూనకాలు తెప్పించే నారాలోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ | TDP