బాత్రూం వీడియోలతో బెదిరించి... యువతిపై ముగ్గురు యువకులు అత్యాచారం (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Jun 09, 2021, 10:07 AM ISTUpdated : Jun 09, 2021, 10:11 AM IST
బాత్రూం వీడియోలతో బెదిరించి... యువతిపై ముగ్గురు యువకులు అత్యాచారం (వీడియో)

సారాంశం

ఓ యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురు కామాంధులు చివరకు కటకటాలపాలయ్యారు. 

విజయనగరం: కాలేజీ రోజుల్లో తోటి విద్యార్థి ప్రేమ పేరుతో నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడో యువకుడు. ఆ తర్వాత ఉద్యోగం చేసే సమయంలో తోటి ఉద్యోగి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరకు ఓ పురోహితుడు కూడా ఈ యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే తాజాగా ఈ ముగ్గురు దుర్మార్గుల పాపం పండి కటకటాలపాలయ్యారు.  

వివరాల్లోకి వెళితే... విజయనగరం జిల్లా పార్వతీపురంకు చెందిన బాధిత యువతి డిగ్రీ చదివే సమయంలో ఓ యువకుడితో ప్రేమ సాగించింది. వీరు సన్నిహితంగా వున్న ఫోటోలు సోషల్ మీడియాలో కూడా పెట్టారు. అయితే యువతిని శారీరకంగా వాడుకుని సదరు ప్రియుడు వదిలిపెట్టాడు.  

ఆ తర్వాత యువతి ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేసే సమయంలో ప్రియుడు మళ్ళీ వెంటపడ్డాడు. యువతి అతడికి దూరంగా వుండటంతో తరచూ ఆమెతో గొడవపడేవాడు. ఈ విషయం తెలిసి ఆమె తోటి ఉద్యోగి సోషల్ మీడియాలోని ఫోటోలను సేకరించి బెదిరింపులకు దిగాడు. ఇలా అతడు కూడా యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 

యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసిన విషయం తెలిసిన ఓ పురోహితుడు కూడా ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా బాత్రూంలో స్నానం చేస్తున్న వీడియోను సంపాదించాడు. అంతేకాదు యువతికి పెళ్లి కుదరడంతో ఆమె న్యూడ్ ఫోటోలు, బాత్రూం వీడియోలు మగపెళ్లివారికి పంపించాడు. దీంతో పెళ్లి ఆగిపోయింది.  

వీడియో

 యువతిని తల్లిదండ్రులు నిలదీయగా తనపై జరిగిన అఘాయిత్యం గురించి బయటపెట్టింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా యువతిని నమ్మించి మోసం చేసిన కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పార్వతీపురం పోలీసులు. ముగ్గురు యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?