తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలకు దసరా సెలవులు

By telugu teamFirst Published Oct 6, 2021, 1:36 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. అయితే, ఈ సెలవులకు ముందు, తర్వాత కూడా ఆదివారాలు కలిసివచ్చాయి. ఈ నెల సెకండ్ శనివారంతో దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించారు. ఈ నెల 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు dussehra holidaysను నిర్ణయించారు. సాధారణంగా andhra pradeshలోొ దసరా పండుగకు ఆరు రోజులు సెలవులిస్తారు. కానీ, ఈ సారి అదనంగా సెలవులూ జోడవ్వతున్నాయి. 11వ తేదీకి ముందు ఆదివారం, అంతకు ముందు రోజు రెండో శనివారం అవుతున్నది. దీంతో ఈ సెలవులు రెండు రోజులు ముందే అంటే శనివారంతోనే ప్రారంభమవుతున్నాయి. అంటే 9వ తేదీ నుంచి పాఠశాలలు సెలవుల్లో ఉండనున్నాయి. అలాగే, దసరా పండుగ సెలవులు ముగిస 16వ తేదీ శనివారం అవుతున్నది.అంటే ఆదివారం తర్వాత కలిసి వస్తున్నది. దీంతో పాఠశాలలు 18వ తేదీన పున:ప్రారంభమవుతున్నాయి. నిజానికి దసరా పండుగ సెలవులు ఆరు రోజులే అయినప్పటికీ రెండు ఆదివారాలు, ఒక శనివారం కలిసి రావడంతో మొత్తం 9 రోజులు సెలవులు కలిసి వస్తున్నాయి.

Telanganaలో ఈ రోజు నుంచే దసరా పండుగ సెలవులు ప్రారంభమయ్యాయి. తిరిగి 18వ తేదీన పాఠశాలలు తెరుచుకుంటాయని తెలంగాణ విద్యా శాఖ వెల్లడించింది. కాగా, 13వ తేదీ నుంచి 16వ తేదీల వరకు నాలుగు రోజులు ఇంటర్ కాలేజీలు సెలవులున్నాయి. తిరిగి 17వ తేదీన ఇంటర్ కాలేజీలు పున:ప్రారంభమవుతాయి.

click me!